సీతారాములు నిద్రించిన ప్రదేశం గురించి మీకు తెలుసా..?

ముఖ్యంగా చెప్పాలంటే మన దేశం యొక్క గొప్ప ఇతిహాసాలలో రామాయణం ఒకటి అని దాదాపు చాలా మందికి తెలుసు.అలాగే రామాయణం( Ramayanam ) గురించి ఆ యోగ పురుషుడు రాముడు గురించి ఎంత విన్నా, ఎన్నిసార్లు విన్నా తనివి తీరదని పెద్దవారు చెబుతూ ఉంటారు.

 Do You Know About The Place Where Sitaram Slept , Sitaram, Place, Ramayanam , B-TeluguStop.com

ఇంకా చెప్పాలంటే రామాయణం గురించి, అందులో చెప్పబడిన సంఘటన గురించి మన దేశంలో ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది.అలాగే చాలా మంది రామాయణం అంటే రాముడి జననం, సీతారాముల కళ్యాణం, సీతా రామ లక్ష్మణుల అరణ్యవాసం, సీతాపుహరణం రావణ పద్ధతి, అయోధ్య రాక రాముడి పట్టాభిషేకం వీటి గురించి ఆలోచిస్తూ ఉంటారు.

Telugu Ayodhya, Bhakti, Devotional, Place, Ramayanam, Sitaram-Latest News - Telu

కానీ ఆ తర్వాత జరిగిన సంఘటన గురించి ఎవరు ఎక్కువగా ఆలోచించరు.అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే సీతారాములు( Seetharams ) నిద్రించిన ప్రదేశాన్ని ఎవరు కూడా చూసి ఉండరు.ఆ ప్రదేశం ఎక్కడ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే నంద్యాల జిల్లా, నందికొట్కూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న రామసముద్రం గ్రామానికి ఎంతో చరిత్ర ఉంది.ఆ రామసముద్రంలో ఉన్న బావి దగ్గర సీతారాములు నిద్రించారని అక్కడే స్నానాలు ఆచరించారని గ్రామంలో ఉన్న పెద్దలు చెబుతూ ఉన్నారు.ఒక రోజు సీతారాములు వేటకు వెళ్ళేటప్పుడు రామసముద్రం అనే ఊరి దగ్గరకి వచ్చేసరికి చీకటవ్వడంతో ఆ గ్రామం నుంచి వెళ్లాలనుకున్న రాత్రివేళ సమయంలో వెళ్లడం ఎందుకని రామసముద్రం గ్రామంలో ఉండవలసి వచ్చింది.

Telugu Ayodhya, Bhakti, Devotional, Place, Ramayanam, Sitaram-Latest News - Telu

ఆ సమయంలో సీతమ్మకు దాహం వేయడంతో రామున్ని సీతమ్మ నాకు దాహం వేస్తుంది అని చెప్పింది.అప్పుడు చుట్టుపక్కలంతా ఎక్కడ చూసినా నీరు లేకపోవడంతో రాముడు తన చేతిలో ఉన్న బాణంతో ఒక్కసారిగా భూమిలోకి బాణం వేశాడు.అప్పుడు అక్కడ నీరు ప్రవహించిందని రామసముద్రం పెద్ద వారు చెబుతున్నారు.అదే విధంగా ఈ బావిలోని నీటితో స్నానాలు ఆచరించడం వల్ల రోగాలు దూరమైపోతాయని ఆ గ్రామస్తులు నమ్ముతారు.

అలాగే గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఎవరికైనా సరే పాము కరిచిన, తేలు కరిచిన ఇప్పటికీ మరణించిన వారు లేరని ఆ గ్రామానికి అంతా చరిత్ర ఉందని పెద్ద వాళ్లు చెబుతున్నారు.అలాగే ఈ గ్రామంలో ముస్తఫా అనే ఒక వ్యక్తి ఆ బావి దగ్గరే ఉండేవాడు.

అక్కడికి వచ్చిన వారందరికీ తాయత్తులు వేస్తూ, మంత్రాలు జపిస్తూ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారందరినీ బాగు చేస్తూ ఉండేవాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube