హిందూ ధర్మంలో సూర్య గ్రహణాలు, చంద్ర గ్రహణాలు అశుభంగా భావిస్తారు.అందుకే ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయరు.
అయితే ఈ సంవత్సరం చివరి సూర్యగ్రహణం అక్టోబర్ 14వ తేదీన ఏర్పడనుంది.సూర్యగ్రహణం సమయంలో రాహు ప్రభావం( Rahu ) బాగా పెరుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
అందుకే సూర్యగ్రహణం సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు.అలాగే గర్భిణీలు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి.
ఏమాత్రం నిర్లక్ష్యం గా ఉన్న తల్లి బిడ్డ ఇద్దరిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఎక్కువగా ఉంది.ఈ సంవత్సరం చివరి సూర్యగ్రహణం భారత్ లో కనిపించదని జ్యోతిష్యులు( Astrologers ) చెబుతున్నారు.
దీనికి సుతాక్ కాలం కూడా చెల్లదు.

అయినప్పటికీ సూర్యగ్రహణం సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.ఈ గ్రహణం సమయంలో గర్భిణులు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే గర్భిణీలు సూర్యగ్రహణం సమయంలో ఇంట్లోనే ఉండాలి.
బయటకు అస్సలు రాకూడదు.అలాగే ఈ సూర్యగ్రహణాన్ని నేరుగా కళ్ళతో చూడకూడదు.
ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అసలు చూడకూడదు.ఈ గ్రహణం సమయంలో నిద్ర( sleep ) పోకూడదని కూడా చెబుతున్నారు.
అలాగే గర్భిణీలు సూదులు, కత్తెరలు, కత్తులు వంటి పదునైన వస్తువులను అస్సలు ఉపయోగించకూడదు.వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

ఈ సమయంలో గర్భిణీ మహిళలు( Pregnant women ) బరువైన వస్తువులను ఎత్తకూడదు.అలాగే ప్రమాదకరమైన పనులను అస్సలు చేయకూడదు.సూర్య గ్రహణం సమయంలో ఆహారాన్ని తినకూడదు.ఎందుకంటే గ్రహణం వల్ల ఆహారం కలుషితం అవుతుందని కూడా చాలామంది ప్రజలు నమ్ముతారు.గ్రహణం సమయంలో తినడం వల్ల అనారోగ్య సమస్యలు( Health problems ) వస్తాయి.అందుకే సూర్య గ్రహణ సమయంలో పిల్లలు, వృద్ధులు ఆహారం తినవచ్చు.
సూర్యగ్రహణ సమయంలో జుట్టుకు నూనెను అప్లై చేయకూడదు.ఇది రాహు పై ప్రతికూల ప్రభావాన్ని ( Negative impact )చూపుతుంది.
గ్రహణం ముగిసిన తర్వాత గర్భిణీ మహిళలు తప్పనిసరిగా స్నానం చేయాలి.అలాగే ధ్యానం చేస్తూ దేవుళ్ళను పూజించాలి అని నిపుణులు చెబుతున్నారు.