అరియానా నెంబర్ అంటూ వాట్సాప్ లో రచ్చ.. క్లారిటీ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ?

కొందరు మోసగాళ్లు సెలబ్రెటీలను బాగా టార్గెట్ చేస్తూ ఉంటారు.ముఖ్యంగా మంచి హోదాలో ఉన్న సెలెబ్రిటీలను మాత్రం అస్సలు వదలరు.

 Ariyana Glory Clarity About Her Fake Phone Number In Whatsapp Details, ,whatsapp-TeluguStop.com

ఇక ఈమధ్య సోషల్ మీడియా అందుబాటులో ఉండటంతో ఏకంగా ఆ మోసగాళ్లు సోషల్ మీడియా ద్వారానే చుక్కలు చూపిస్తున్నారు సెలెబ్రిటీలకు.వారి సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేయడం లేదా ఫేక్ నెంబర్లతో వారి పేర్లు మీద ఇతరులతో చాట్ చేయడం లాంటివి చేస్తుంటారు.

ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు ఇటువంటి మోసాలకు గురయ్యారు.

తమ అకౌంట్లు హ్యాక్ అయ్యాయని వాపోయారు.

ఇక తాజాగా బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ కూడా ఇటువంటిదే ఎదుర్కొంది.ఇంతకు అసలేం జరిగిందో తెలుసుకుందాం.

టాలీవుడ్ బుల్లితెరకు చెందిన అరియానా గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.యాంకరింగ్ తో తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈ బ్యూటీ ఎప్పుడైతే రాంగోపాల్ వర్మ బోల్డ్ ఇంటర్వ్యూ చేసిందో ఆ సమయంలోనే అందరి దృష్టిలో పడింది.

ఆ ఇంటర్వ్యూలో తన బోల్డ్ మాటలతో అందర్నీ ఆశ్చర్యపరిచింది ఈ హాట్ బ్యూటీ.

Telugu Anchor Ariyana, Ariyana, Ariyanaphone, Ariyana Glory, Whatsapp-Movie

అలా బోల్డ్ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ లో అడుగుపెట్టి హౌస్ లో ఉన్నంతకాలం బాగా రచ్చ రచ్చ చేసింది.అంతేకాకుండా అందులో తన ఆట తీరుతో అందర్నీ ఆకట్టుకుంది.షో నుండి బయటికి వచ్చాక పలు షార్ట్ ఫిలిమ్స్ కూడా చేసింది.

అంతేకాకుండా బిగ్ బాస్ బజ్ లో ఇంటర్వ్యూ కూడా చేసింది.బుల్లితెరపై పలు షోలల్లో కూడా కనిపించింది.

ఇక సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన స్పైసీ అందాలను బయటపెడుతుంది.

Telugu Anchor Ariyana, Ariyana, Ariyanaphone, Ariyana Glory, Whatsapp-Movie

సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.ఖాళీ సమయం దొరికితే చాలు ఫ్రెండ్స్ తో బాగా చిల్ అవుతూ సందడి చేస్తుంది.తన డాన్స్ వీడియోలను, హాట్ ఫోటోలను బాగా షేర్ చేస్తూ ఉంటుంది.

ప్రస్తుతం బుల్లితెరపై బిబి జోడి లో పాల్గొన్న సంగతి తెలిసిందే.ఇందులో తన డ్యాన్స్ తో బాగానే ఆకట్టుకుంటుంది.

అలా ఒకవైపు బిజీగా ఉంటూనే మరో వైపు సోషల్ మీడియాలో సమయాన్ని కేటాయిస్తుంది.అయితే ఇదంతా పక్కనే పెడితే తాజాగా తన ఇన్ స్టా వేదికగా ఒక స్టోరీ పంచుకుంది.

ఏంటంటే అందులో ఒక నెంబర్ ను చూపించగా అందులో తన ఫ్రెండ్స్ తో పాటు తన ఫోటో వాట్సప్ ప్రొఫైల్ పిక్ గా ఉంది.అయితే అది తన నెంబర్ కాదు అంటూ.

తన పేరుతో ఎవరు ఈ నెంబర్ నుండి చాట్ చేస్తున్నారు అని.ఆ నెంబర్ నుండి తన సెలబ్రిటీ ఫ్రెండ్స్ కి మెసేజెస్ కూడా పోయాయి అని ఆ స్క్రీన్ రికార్డు మొత్తం పంపింది.ఇది ఫేక్ నెంబర్ అని క్లారిటీ ఇచ్చింది.ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube