రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.మే లేదా జూన్‌కు షూటింగ్ పూర్తి అయ్యే అవకాశం ఉంది.
భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రను పోషిస్తుండగా అల్లూరి సీతారామరాజు పాత్రను రామ్ చరణ్ పోషిస్తున్నారు.వీరిద్దరు కూడా స్టార్ హీరోలు అవ్వడంతో సినిమాపై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి.
అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని జక్కన్న తెరకెక్కిస్తున్నాడు.

ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ ఒక్కటి అంటే ఒక్కటి కూడా రాలేదు.సినిమాలో రామ్ చరణ్ ఎన్టీఆర్‌లు ఎలా కనిపిస్తారా అంటూ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.భారీ ఎత్తున ఈ సినిమాకు బడ్జెట్ ఖర్చు చేస్తున్నారు.
సినిమాను ఈ ఏడాది జులై అనుకున్నారు.కాని వీలు పడక పోవడంతో వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా వేశారు.
సినిమా విడుదలకు ఇంకా పది నెలల సమయం ఉంది.ఈ సమయంలో చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్ కోసం పోస్టర్‌లు విడుదల చేయక పోవచ్చు అంటున్నారు.ఈనెలలో చరణ్ బర్త్‌డే ఉన్న కారణంగా చరణ్ మేకోవర్ మరియు వర్కింగ్ స్టిల్స్‌ను వీడియోను విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.చరణ్ పుట్టిన రోజుకు ఈ స్పెషల్ వీడియో విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.







