Weather Health : వాతావరణం లో ఈ మార్పులు వస్తే వారి ఆరోగ్యానికి ప్రమాదమా..

ప్రపంచవ్యాప్తంగా మూడు నాలుగు నెలలకు ఒకసారి వాతావరణంలో ఎన్నో మార్పులు జరుగుతూనే ఉంటాయి.వాతావరణంలో ఉష్ణోగ్రత కూడా అప్పుడప్పుడు పెరుగుతూనే ఉంటుంది.

 If These Changes In The Weather Occur, Is It A Danger To Their Health, Health, H-TeluguStop.com

వాతావరణం లోని హెచ్చుతగ్గుల వల్ల పలు రకాల వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉంది.చిన్న చిన్న వ్యాధులే కాకుండా ఫంగల్ ఇన్ఫెక్షన్లు కూడా పెరిగిపోతూ ఉంటాయి.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు నాలుగు రకాల యాంటీ ఫంగల్ మందులు మాత్రమే ఉండడం వల్ల ఈ వ్యాధులు వస్తే ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.ఈ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ 19 రకాల ఫంగల్ వ్యాధుల జాబితాను విడుదల చేసింది.

వాతావరణం మార్పుల వల్ల ఫంగస్ విస్తరిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.ఈ మధ్యకాలంలో కరోనా వల్ల అనేక రకాల వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి.దీనివల్ల చాలామంది ప్రజలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు.కొంతమంది ప్రజలలో బలహీనమైన రోగనిరోధక శక్తి ఉండడంవల్ల వారిలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వచ్చే ప్రమాదం కూడా ఉంది.

ఇప్పటికే హెచ్‌ఐవీ, క్యాన్సర్, కాలేయం లేదా మూత్రపిండాల వ్యాధి ఉన్నవారిలో కొన్ని రకాల ఫంగల్ వ్యాధి ప్రాణాపాయం వచ్చే అవకాశం ఉంది.ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఈ సమస్యను చాలా పెంచింది అని చెప్పవచ్చు.

దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా చర్మ సమస్యలు కూడా ఎక్కువగా పెరుగుతున్నాయి.

Telugu Antibacterial, Cancer, Tips, Liver-Telugu Health

ఈ వాతావరణ మార్పుల వల్ల ప్రభుత్వ ఆసుపత్రులలో ఫంగల్ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న రోగులు పెరిగిపోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.ఆస్పత్రులలో చాలామంది శర్మ వ్యాధి రోగులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.వాతావరణ మార్పుల వల్ల ఇలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు ప్రజలకు సులభంగా సోకుతున్నాయి.

కరోనా సమయంలో కూడా అనేక రకాల ఫంగల్ వ్యాధులు పెరిగిపోయాయి.ప్రపంచంలోని అనేక దేశాల్లో క్యాండిడా వంటి శిలీంధ్రాలు పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ శాస్త్రవేత్తలకు హెచ్చరిస్తోంది.

యాంటీ బాక్టీరియల్ మందులు కూడా రోగులను నయం చేయలేకపోతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube