మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎవరికైనా రెడ్ కార్పెట్ వేస్తుంది.అందుకే మన టాలీవుడ్ లోనే ఎక్కువగా పనభాష హీరోయిన్స్ కనిపిస్తూ ఉంటారు.
గ్లామర్, నటన, టాలెంట్ ఉంటే చాలు అవకాశాలు అవే వెతుక్కుంటూ వస్తాయి.ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువగా కన్నడ హీరోయిన్స్ కనిపిస్తున్నారు.
ఏడాదికి నలుగురు లేదా ఐదుగురు కొత్త హీరోయిన్లు తమ స్థానాన్ని తెలుగులో పదిలం చేసుకుంటున్నారు.ఇంతకుముందు ఎక్కువగా బాంబే నుంచి హీరోయిన్స్ వచ్చేవారు.
ఆ తర్వాత కొన్నాళ్లపాటు మలయాళ హీరోయిన్ల హవా నడిచింది.వారి స్థానంలో కన్నడ హీరోయిన్స్ రావడం ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది.
ఇంతకు ముందు పూజా హెగ్డే, రష్మిక సైతం కన్నడ నుంచి తెలుగులోకి వచ్చిన వారే.ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆ బ్యూటీస్ ఎవరో తెలుసుకుందాం.
ఆషిక రంగనాథ్
కన్నడ లో హీరోయిన్ గా ఉన్న ఆషిక రంగనాథ్ కళ్యాణ్ రామ్ సినిమా ద్వారా తెలుగులో ప్రవేశించ బోతుంది.మైత్రి మూవీ మేకర్స్ తీస్తున్న అమిగోస్ సినిమాలో కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తుంటే, ఆషిక హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమా హిట్ అయితే ఆషిక స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగే అవకాశం ఉంది.
కావ్యా శెట్టి.
లవ్ మాక్ టైల్ అనే కన్నడ సినిమాకు తెలుగు లో రీమేక్ గా వస్తున్న సినిమా గుర్తుందా శీతాకాలం.ఈ సినిమాలో సత్య దేవ్ మరియు తమన్నా మెయిన్ లీడ్ రోల్ నటిస్తున్నారు.
తమన్నా కాకుండా మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా నటిస్తుండగా అందులో మేఘ ఆకాష్ ఒక హీరోయిన్ కాగా, మరొక హీరోయిన్ కావ్య శెట్టి.కన్నడ సినిమ పరిశ్రమలో గ్లామర్ హీరోయిన్ గా కావ్య చలామణి అవుతుంది.
శ్రీనిధి శెట్టి
కెజిఎఫ్ సినిమాల ద్వారా శ్రీనిధి శెట్టి బాగా పాపులర్ అయ్యింది.దాంతో ఈ అమ్మడికి టాలీవుడ్ లో సైతం బాగానే అవకాశాలు వస్తున్నాయి.ఆమె నటిస్తున్న తెలుగు చిత్రం తవరలోనే షూటింగ్ ప్రారంభించుకుంటుంది.ఇక వీరు మాత్రమే కాదు కన్నడ లో తొలుత నటించి తెలుగు లో అడుగు పెట్టిన హీరోయిన్స్ లో ఉప్పెన భామ కృతి శెట్టి, పెళ్లి సందడి హీరోయిన్ శ్రీలీల సైతం ఉన్నారు.
వీరు కన్నడ సినిమాల్లో నటన ప్రారంభించి తెలుగు బిజీ అవుతున్నారు.