గులాబీ పువ్వు అంటే చాలా ప్రత్యేకమైన పువ్వు అని చెప్పుకోవచ్చు.చాలా మంది అమ్మాయిలు ఇంట్లో గులాబీ మొక్కలను పెంచుతూ ఉంటారు.
గులాబీ పువ్వు కూడా ఇంటిని అలంకరించడం నుండి ముఖానికి పూసుకోవడం వరకు ఎన్నో రూపాల్లో ఉపయోగిస్తారు.గులాబీ పువ్వు కూడా ఒక ఔషధం లాంటిదే.
ఇది చర్మ సంరక్షణ కోసం చాలా ఉపయోగపడుతుంది.అయితే అదే విధంగా గులాబీకి వాస్తు శాస్త్రంలో కూడా చాలా ప్రాముఖ్యత ఉంది.
గులాబీ పువ్వుని ఇలా వాడితే మీ దరికి కష్టాలు అస్సలు చేరవని నిపుణులు చెబుతున్నారు.
వాస్తు శాస్త్రం ప్రకారం మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లయితే తరచుగా డబ్బు కొరత ఉంటే శుక్రవారం రోజున గులాబీ పువ్వు పై రాగి ముక్కను కాల్చి లక్ష్మీదేవికి( Lakshmi devi ) సమర్పించాలి.
ఇక శుక్రవారం రోజున సాయంత్రం సమయంలో ఈ పరిహారం చేయాలి.ఇలా చేస్తే త్వరలోనే ధనవంతులు అవ్వవచ్చు అని వాస్తు శాస్త్రం చెబుతోంది.ఇక వాస్తు శాస్త్రం ప్రకారం మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరాలని అనుకున్నా మంగళవారం లేదా శనివారం రోజున హనుమంతునికి 11 తాజా గులాబీ పువ్వులను సమర్పించాలి.ఇలా 11 మంగళవారాలు నిరంతరం చేయాలి.
ఇలా చేస్తే మీ ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది.

ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉండాలంటే లక్ష్మీదేవి ఆలయంలో వరుసగా 11 శుక్రవారం ఎర్ర గులాబీ పువ్వు( Red Rose )లను సమర్పించాలి.ఇలా చేస్తే మీ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉంటుంది.ఇక ఎప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది.
ఇక ఇంట్లో ఉన్న వ్యక్తి చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే తమలపాకులో గులాబీ పువ్వు వేసి 11 సార్లు వ్యాధిగ్రస్తులకు దిష్టి తీసి నదిలో పారేయాలి.ఇలా చేస్తే అనారోగ్యం నుండి ఉపశమనం లభిస్తుంది.
ఇక మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తుంటే క్రమం తప్పకుండా 40 రోజులు పాటు చెప్పులు లేకుండా హనుమాన్( Hanuman ) ఆలయానికి వెళ్లి ఎర్ర గులాబీ పువ్వులు మారుతికి సమర్పించాలి.ఇలా శనివారం నాడు ఈ పరిహారం చేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది.
DEVOTIONAL