ఆ సినిమాలను రిజెక్ట్ చేసి చైతన్య తప్పు చేశారా.. స్టార్ హీరో అయ్యేవాడంటూ?

టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన నాగచైతన్య జోష్ సినిమా నుంచి భిన్నమైన కథలను ఎంచుకుంటూ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ఏ మాయ చేశావె, 100% లవ్, తడాఖా, మజిలీ, మనం, మరికొన్ని సినిమాలు నటుడిగా నాగచైతన్య రేంజ్ ను పెంచాయి.

 Young Hero Nagachaitanya Rejected Movies Details Here Goes Viral , Kotta Bangar-TeluguStop.com

అయితే నాగచైతన్య తన సినీ కెరీర్ లో మూడు బ్లాక్ బస్టర్ సినిమాలను వదులుకున్నారు.ఈ సినిమాలను రిజెక్ట్ చేయకుండా ఉండి ఉంటే మాత్రం చైతన్య కెరీర్ మరోలా ఉండేది.

నాగచైతన్య జోష్ సినిమాతో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టినా ఈ సినిమా కంటే ముందు చైతన్యకు కొత్తబంగారు లోకం సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది.అయితే కథ నచ్చినా కొన్ని కారణాల వల్ల ఆ సినిమాతో నాగచైతన్య ఎంట్రీ జరగలేదు.

ఆ తర్వాత కొత్తబంగారు లోకం సినిమాలో వరుణ్ సందేశ్ నటించడం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే.ఈ సినిమాలో నటించి ఉంటే తొలి సినిమాతోనే చైతన్య ఖాతాలో సక్సెస్ చేరి ఉండేది.

Telugu Aa, Bhalebhale, Kottabangaru, Nagachaitnya-Movie

నాగచైతన్య రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో భలే భలే మగాడివోయ్ ఒకటి.మతిమరపు ఉన్న అబ్బాయి పాత్ర రిస్క్ అని భావించిన నాగచైతన్య ఆ పాత్రలో నటించడానికి ఆసక్తి చూపలేదు.అదే సమయంలో వరుస ఫ్లాపుల్లో ఉన్న నాని అదే సమయంలో ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు.నాగచైతన్య ఈ సినిమాను వదులుకొని తప్పు చేశారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Telugu Aa, Bhalebhale, Kottabangaru, Nagachaitnya-Movie

నాగచైతన్య ఈ సినిమాలతో పాటు త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కిన అఆ సినిమాలో నటించే అవకాశాన్ని కూడా వదులుకున్నారు.ఈ సినిమా నితిన్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే.ఈ సినిమా ఫుల్ రన్ లో 40 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.డేట్లు కేటాయించలేక నాగచైతన్య ఈ సినిమాను వదులుకున్నారని సమాచారం అందుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube