ముఖ్యంగా చెప్పాలంటే కార్తిక అమావాస్య( Karthika Amavasya ) డిసెంబర్ 12వ తేదీన వస్తుంది.అలాగే డిసెంబర్ 13వ తేదీన పోలి పాడ్యమి అని అంటారు.
ఈ రోజుతో కార్తీకమాసం పూర్తయి మార్గశిర మాసం ప్రారంభమవుతుందని పండితులు చెబుతున్నారు.కార్తీక మాసంలో నెల రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన వారు కార్తీక అమావాస్య మరుసటి రోజు మార్గశిర మాసం( Margashira Masam ) మొదటి రోజు అయిన పోలి పాడ్యమి రోజు దీపాలు వెలిగిస్తారు.
అసలు ఆ రోజుకు పోలి పాడ్యమి( Poli Padyami ) అనే పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.పూర్వం ఒక గ్రామంలో ఒక ఉమ్మడి కుటుంబంలో ఐదుగురు కోడల్లు ఉండేవారు.
వారిలో చిన్న కోడలి పేరు పోలి.ఆమెకు చిన్నప్పటి నుంచి దైవభక్తి ఎక్కువగా ఉండేది.
కానీ ఆ భక్తి అత్తగారికి నచ్చలేదు.ఎందుకంటే తన కంటే భక్తురాలు మరొకరు ఉండకూడదని ఆమె అనుకునేది.తనే నిజమైన భక్తురాలు అని అహంకారంతో ఉండేది.అందుకే చిన్న కోడలైన పోలితో పూజలు చేయనిచ్చేది కాదు.కార్తీకమాసం( Karthika Masam ) వచ్చినప్పుడు కూడా మిగిలిన కోడళ్లను తీసుకొని నదికి వెళ్లి స్నానమాచరించి, దీపాలు వెలిగించుకుని, పూజలు చేయించి వచ్చేది.కానీ పోలిని మాత్రం పట్టించుకునేది కాదు.
పైగా తనకు ఎలాంటి సౌకర్యం లేకుండా చేసేది.కానీ పోలి మాత్రం బాధపడేది కాదు.
అత్తగారు తోడికోడళ్ళు అటు వేల్లగాన్నే పెరట్లోని పత్తి చెట్టు నుంచి కాస్త పత్తి తీసుకొని కవ్వానికి ఉన్న వెన్నను తీసి పత్తికి రాసి దీపం వెలిగించేది.
ఆ దీపం ఎవరికి కంట పడకుండా దానిపై బుట్ట బొర్లించేది.కార్తీక మాసం అంతా సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం ఆచరించి దీపారాధన చేసేది.చివరికి కార్తీక అమావాస్య పూర్తయి పోలి పాడ్యమి రాగానే అందరూ నదికి వెళ్ళిపోతూ పోలికి చేతినిండా పని అప్పగించి వెళ్ళిపోయారు.
కానీ అప్పటికే ఇంటి పనులు పూర్తిచేసుకుని కార్తీక దీపం( Karthika Deepam ) వెలిగించింది.ఎన్ని అడ్డంకులు ఎదురైనా పోలి భక్తి తప్పకపోవడం చూసి దేవతలంతా ఆమెను ఆశీర్వదించారు.
ఆమెను ప్రాణం ఉండగానే స్వర్గానికి తీసుకెళ్ళేందుకు పుష్పక విమానంతో వచ్చారు.అప్పుడే ఇంటికి చేరుకున్న అత్తగారు మిగిలిన కోడళ్ళు పోలిని, విమానాన్ని చూసి ఆశ్చర్యపోయారు.
అది తమ కోసమే వచ్చిందనీ అనుకున్నారు.కానీ అంతలో పోలిని చూసి నిర్ధాంత పోయారు.
తము కూడా స్వర్గానికి వెళ్లాలనే తాపత్రయంతో పోలీ కాళ్లు పట్టుకొని వ్రేలాడే ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది.విమానంలోని దేవదూతలు పోలి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి భక్తి ఉందని వారిని కిందనే వదిలేసి వెళ్లిపోయారు.
DEVOTIONAL