ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.46
సూర్యాస్తమయం: సాయంత్రం.5.51
రాహుకాలం: ఉ.9.00 ల10.30
అమృత ఘడియలు: ఉ.6.22 ల7.44
దుర్ముహూర్తం: ఉ.6.30 ల7.36
మేషం:
ఈరోజు బంధు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి.స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు.చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి.వృత్తి వ్యాపారాలలో మరింత పుంజుకుంటాయి.ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహాయంతో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు.
వృషభం:
ఈరోజు అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు.మిత్రులతో సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.
సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి.వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు.
మిథునం:
ఈరోజు కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యపరుస్తుంది.దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరగటం వలన శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు ఉంటాయి వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి.ఉద్యోగమున ఒడిదుడుకులు పెరుగుతాయి.
కర్కాటకం:
ఈరోజు ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగి విశ్రాంతి లభించదు.దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.చేపట్టిన పనులలో అవరోధాలు ఉంటాయి.వృత్తి వ్యాపారాలు మరింత నిరాశ కలిగిస్తాయి.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది.
సింహం:
ఈరోజు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.ఉద్యోగమన వివాదాలు సర్దుమణుగుతాయి.కొన్ని ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు కలిసివస్తాయి.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.
కన్య:
ఈరోజు గృహమున వివాహ ప్రస్తావన వస్తుంది.నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు.ఆలోచనలు ఆచరణలో పెడతారు.
బంధుమిత్రులు నుండి శుభవార్తలు అందుతాయి.వృత్తి వ్యాపారాలలో ఆత్మ విశ్వాసంతో నిర్ణయాలు తీసుకుని లాభపడతారు.ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
తుల:
ఈరోజు సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి.పాత మిత్రుల నుండి శుభ కార్య ఆహ్వానాలను అందుకుంటారు.కొన్ని వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు.
వృత్తి వ్యాపారాలలో నష్టాలు భర్తీ చేస్తారు.ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి.
ధనుస్సు:
ఈరోజు వాహన ప్రయాణాల్లో ఇబ్బందులుంటాయి.బంధు మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.అనుకొన్న సమయానికి పనులు పూర్తి కావు.ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.వ్యాపారస్తులకు వచ్చిన అవకాశాలు చేజారిపోకుండా చూసుకోవాలి.
ధనుస్సు:
ఈరోజు ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది.కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు.సంతాన విషయమై కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు.
వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా రాణిస్తాయి.ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది.ఆర్థిక లాభాలు అందుతాయి.
మకరం:
ఈరోజు ఆర్ధిక అభివృద్ధి కలుగుతుంది.దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి.వృత్తి, ఉద్యోగముల విషయంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది.
వాహన సంబంధిత వ్యాపారాలు లాభాలుబాట పడతాయి.స్ధిరాస్తి క్రయవిక్రయాలలో ఆశించిన లాభాలు పొందుతారు.
కుంభం:
ఈరోజు ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి.ముఖ్యమైన పనులందు ఆటంకములు కలిగిన సమయస్ఫూర్తితో పనులు పూర్తి చేస్తారు.బంధు మిత్రులతో అకారణ వివాదములకు దూరంగా ఉండటం మంచిది.భాగసౌమ్య వ్యాపారాలలో నష్ట సూచనలు ఉన్నవి.
మీనం:
ఈరోజు వ్యాపారాలు విస్తరణకు నూతన అవకాశాలు లభిస్తాయి.ఆదాయ వ్యవహారములు మరింత పుంజుకుంటాయి.ముఖ్యమైన పనులలో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుతాయి.మొండి బకాయిలు వసూలవుతాయి.బంధు మిత్రుల ఆదరణ పొందుతారు.