రోజు ఈ నూనెతో మర్దన చేసుకుంటే నెల రోజుల్లో మోకాళ్ళ‌ నొప్పులు పరార్!

వయసు పైబ‌డే కొద్ది మోకాళ్ళ నొప్పులు మదన పెట్టడం సర్వసాధారణం.కానీ ప్రస్తుత రోజుల్లో ముప్పై ఏళ్ల వారు సైతం మోకాళ్ళ నొప్పుల బారిన పడుతున్నారు.

 If You Massage With This Oil Daily, The Knee Pains Will Go Away , Knee Pains, Kn-TeluguStop.com

పోషకాహార లోపం, బరువు పెరగడం లేదా తగ్గడం, అతిగా వ్యాయామాలు చేయడం తదితర కారణాల వల్ల మోకాళ్ళ నొప్పులు తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటాయి.ఓసారి మోకాళ్ళ నొప్పుల కారణంగా నడవడానికి కూడా ఎంతో ఇబ్బందిగా మారుతుంటుంది.

దీంతో మోకాళ్ళ నొప్పులను వదిలించుకోవడం కోసం ఎన్నెన్నో మందులు వాడుతుంటారు.కానీ సహజంగా కూడా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు.

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే నూనెతో ప్రతిరోజు మ‌ర్ద‌న చేసుకుంటే నెల రోజుల్లో మోకాళ్ళ‌ నొప్పులు ప‌రార్ అవుతాయి.మరింతకీ ఆ నూనెను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక గ్లాస్ ఆవ నూనె వేసుకోవాలి.

నూనె హీట్ అవ్వడానికి ముందే శుభ్రంగా పొట్టు తొలగించి మెత్తగా దంచిన పది వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి.

అలాగే మూడు రెబ్బల కరివేపాకు, నాలుగు లవంగాలు, పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసి చిన్న మంటపై ఉడికించాలి.కనీసం ప‌ది నుంచి ప‌న్నెండు నిమిషాల పాటు ఆయిల్ ను హీట్ చేసి ఆపై స్టైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.ఈ ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బాటిల్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.

ప్ర‌తి రోజు ఈ నూనె మోకాళ్ళకు అప్లై చేసి కనీసం ప‌ది నిమిషాలైనా మర్దన చేసుకోవాలి.అదే సమయంలో కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ డి, విటమిన్ కె పుష్కలంగా ఉండే ఆహారాలను డైట్ లో చేర్చుకోండి.శరీర బ‌రువును అదుపులోకి తెచ్చుకోండి.అధికంగా వ్యాయామాలు చేయడం మానుకోండి.తద్వారా నెల రోజుల్లో మోకాళ్ళ నొప్పులు పరార్ అవుతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube