ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఈ క్రమంలో ఇవాళ్టిలో మనీశ్ సిసోడియా కస్టడీ ముగిసింది.
కస్టడీ ముగిసిన నేపథ్యంలో సిసోడియాను మధ్యాహ్నం ప్రత్యేక కోర్టులో సీబీఐ అధికారులు హాజరుపరచనున్నారు.ఇప్పటికే ఐదు రోజులపాటు సీబీఐని అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే.
లిక్కర్ పాలసీ రూపకల్పన – అమలులో జరిగిన అక్రమాలపై ప్రశ్నించినట్లు సమాచారం.నిందితులతో ఉన్న సంబంధాలపై ఆరా తీశారు.
ఈ క్రమంలోనే సిసోడియా స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు సీబీఐ.అదేవిధంగా కస్టడీ పొడిగింపు లేదా జ్యుడిషీయల్ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరనుంది.
కాగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏ1గా మనీశ్ సిసోడియా ఉన్న సంగతి తెలిసిందే.ఫిబ్రవరి 26న సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది.