ముఖ్యంగా చెప్పాలంటే పరీక్షిత్తు మహా రాజుల తను కూడా ఏడు రోజుల పాటు భాగవతం విని( Bhagavatam ) మోక్షం పొందాలని ఒక రాజు అనుకున్నాడు.వెంటనే ఆ రాజు పండితున్ని పిలిచి భాగవతం చదివించుకొని విన్నాడు.
వారం గడిచిన ఇంకా తనకు మోక్షం( Moksham ) ఎందుకు సిద్ధించలేదని పండితున్ని అడిగాడు.ఆ మాటలు విన్న పండితుడు రాజా నా పని భాగవతాన్ని వినిపించడం వరకు మాత్రమే అని జవాబు ఇచ్చాడు.
అలాగే మోక్షం ఇప్పిస్తానని నేను చెప్పలేదు కదా అని జవాబు ఇచ్చాడు.అయితే మీ ప్రశ్నకు మా గురువు సరైన సమాధానం చెప్పగలరు అని పండితుడు చెప్పాడు.
ఆయన్ని పిలిపించండి అని రాజు అన్నాడు.అప్పుడు గురువు వచ్చారు.పండితుడిని ( Scholar ) అడిగిన ప్రశ్నను రాజు అతన్ని కూడా అడిగాడు.అప్పుడు గురువు ఇలా అన్నాడు.ఒక పావు గంట పాటు నన్ను ఈ రాజ్యానికి రాజును చేస్తే( King ) మీ సందేహం తీరుస్తాను మహారాజా అని గురువు అన్నాడు.అలాగేనని రాజు మాట ఇచ్చాడు.
గురువు సింహాసనం అధిరోహించగానే పండితున్ని, రాజును ఇద్దరినీ బంధించమన్నాడు.కొన్ని నిమిషాల తర్వాత గురువు పండితుడి వంకా చూసి రాజును బంధ విభక్తున్ని చెయ్యి అన్నాడు.
దానికి పండితుడు నా కట్లు ఇప్పకుండా నేనెలా విడిపించగలను అన్నాడు.
అప్పుడు గురువు ఇలా అన్నాడు.రాజా ఇప్పుడు మీ సందేహం తీరిందా.బందీ అయిన వ్యక్తి మరొకరి బంధనాలను తొలగించలేనట్లే ముక్తుడు కానీ వ్యక్తి మరొకరికి ముక్తి కలిగించలేడు అని గురువు అన్నాడు.
శుక మహర్షి( Shuka Maharshi ) వంటి యోగి లభించి పరీక్షిత్తు అంతటి శ్రద్ధ సూక్తులు ఉన్నప్పుడే మోక్షం సిద్ధిస్తుందని తెలిపాడు.అంటే బోధించే గురువు మహా జ్ఞాని అయి ఉండాలి.
అలాగే అది వినే వ్యక్తికి అర్థం చేసుకునే గొప్ప విజ్ఞత కూడా ఉండాలి అని గురువు వివరించాడు.అప్పుడే మోక్షం సిద్ధిస్తుందని గురువు రాజుకు వివరించారు.
LATEST NEWS - TELUGU