ఈ రోజు పంచాంగం(Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 05.56.
సూర్యాస్తమయం: సాయంత్రం 06.12.
రాహుకాలం: సా.12.00 నుంచి 1.30 వరకు.
అమృత ఘడియలు: సా 04.55 నుంచి 06.28 వరకు వరకు.
దుర్ముహూర్తం: సా 04.32 నుంచి 05.21 వరకు.
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

డబ్బును పొదుపు చెయ్యండి.విచ్చలవిడిగా ఖర్చు చెయ్యకండి.మీకు భవిష్యత్తులో డబ్బు అవసరం అవుతుంది.ఆ సమయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే మీకు ఆర్ధికంగా నష్టం జరుగుతుంది.మీ లక్ష్యాన్ని మీరు చేరుకోవాలంటే కాస్త కఠినంగా ఉండాలి.
వృషభం:

వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టె ముందు కుటుంబసభ్యుల సలహాలు తీసుకోండి.కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికి మీ తెలివితో ఆలోచనతో వాటిని పరిష్కరిస్తారు.మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.
మిథునం:

కొన్ని బాధ్యతలు స్వీకరిస్తారు.వాటికోసం మీ సమయం మొత్తం పెడుతారు.ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.ఈరోజు అంత ఎంతో ఆనందంగా ఆహ్లదంగా గడిచిపోతుంది.
కర్కాటకం:

ఆర్ధిక ఇబ్బందులు వస్తాయ్.కానీ అనుకున్న సమయానికి డబ్బు అంది ఎంతో ఆనందంగా సమయాన్ని గడుపుతారు.మీ జీవితంలో కొన్ని విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటారు.జీవిత భాగస్వామితో భవిష్యత్తుపై కొన్ని ఆలోచనలను పంచుకుంటారు.
సింహం:

ఆరోగ్యసమస్యల నుంచి విముక్తులవుతారు.ఆర్ధిక లావాదేవీలు నిరంతరాయంగా జరిగినప్పటికీ రోజు చివరిలో ధనాన్ని పొదుపు చేయలేకపోతారు.వివాహం ఈరోజు మీకు జీవితంలో ఒక మంచి అనుభూతుని అందిస్తుంది.
కన్య:

పిల్లలు మీకు మంచి పేరు తీసుకువస్తారు.ఈరోజు పాతమిత్రులను కలిసి కొంచం సమయాన్ని ఆనందంగా గడుపుతారు.పాత రోజులను గుర్తు చేసుకుంటారు.ఉద్యోగపరంగా కూడా మీకు మంచి అవకాశాలు వస్తాయ్.
తులా:

కుటుంబంలో కొన్ని సమస్యలు వస్తాయ్.ఎంతో తెలివిగా ఆలోచనతో వాటిని పరిష్కరించుకోవాలి.ఆవేశంతో కాకుండా ఆలోచనతో ముందడుగు వెయ్యాలి.
అప్పుడే మీకు ఎటువంటి సమస్య రాదూ.ఇతరులకు సహాయం చేసే గుణం మీకు గౌరవం తెచ్చి పెడుతుంది.
వృశ్చికం:

ఆర్థికపరమైన విషయముల మీ జీవితభాగస్వామితో కొన్ని గొడవలు జరుగుతాయ్.అయినప్పటికీ మీ ప్రశాంత వైఖరి వల్ల మీరు అన్ని సమస్యల నుంచి బయటపడతారు.మానసిక ఒత్తిడికి గురవుతారు.కాసేపు ధ్యానం చెయ్యడం మంచిది.
ధనస్సు:

అనుకోని రీతిలో సమస్యలు వస్తాయ్.ఆవేశంతో కాకుండా ఆలోచనతో ముందడుగు వెయ్యాలి.లేదంటే ఇబ్బంది పడుతారు.ఉద్యోగంలో ఒత్తిడికి గురవుతారు.సమస్యలు తట్టుకోలేక ఇబ్బంది పడుతారు.ధ్యానం చేస్తే మానసిక ప్రశాంతత సొంతం అవుతుంది.
మకరం:

మీ జీవితభాగస్వామి నోటి దురుసు మాటలు మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడుతాయ్.ఆ సమస్యల నుంచి మీరు బయటపడాలంటే ఆలోచనతో ముందడుగు వెయ్యాలి.అప్పుడే మీకు ఎటువంటి సమస్య రాదు.ఆర్ధికంగా మీకు ఈరోజు మంచిరోజు.
కుంభం:

ఎవరైనా మిమ్మల్ని రుణం అడిగితే ఇవ్వకపోవడం మంచిది.వ్యక్తిగత విషయాలు మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడుతాయ్.అనారోగ్యం కారణంగా ఏదైనా పని చేయాలి అనుకున్న చెయ్యలేరు.జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.
మీనం:

మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది.పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది.ఒత్తిడిని నుంచి తప్పించుకునేందుకు మీరు ధ్యానం చెయ్యాల్సి ఉంటుంది.మీకు విశ్రాంతి అవసరం.మీ జీవితంలోకి అనుకోని వ్యక్తి వస్తారు.ఈరోజు అంత ఎంతోసంతోషంగా సమయాన్ని గడుపుతాడు.