నేటి సమాజంలో చాలామంది తమ వయసును చెప్పడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు.ముఖ్యంగా ఈ విషయం గురించి ఆడవారు మరీ మొహమాటపడుతుంటారు.
కానీ, ప్రస్తుత కాలంలో చాలామంది యువకులు యవ్వనంలోనే ముసలివారిలా కనిపించడం చాలా బాధాకరం.ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే యవ్వనంగా చాలా కాలం పాటు యువనంగా కనిపించవచ్చు.
పాల ఉత్పత్తులు వాడడం వల్ల శరీరం ఫిట్‌నెస్‌గా ఉంటుందని చాలామంది చెబుతారు.కానీ వీటివల్ల కొన్ని ఆరోగ్యానికి చెడు ప్రమాదం కూడా ఉంది.ఇవి కొంతమందికి శరీరంలో మంటను పెంచుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.దీనివల్ల ఆక్సీకరణ ఒత్తిడి జరిగి త్వరగా వృద్ధాప్యం వచ్చే అవకాశం ఉంది.
వనస్పతి ఉపయోగించడం వల్ల మనుషుల చర్మ ఆరోగ్యం ఎక్కువగా దెబ్బ తినే అవకాశం ఉంది.దీనికి గల కారణం వనస్పతి కూరగాయల నూనె, ట్రాన్స్ ఫ్యాట్ నుంచి తయారవుతుంది.
ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు.బదులుగా వంటలలో ఆలివ్ నూనెను ఉపయోగించడం చాలా మంచిది.

వేయించిన ఆహారాన్ని ఎప్పుడో ఒకసారి తింటే పెద్దగా ఆరోగ్యం పై చెడు ప్రభావం చూపే అవకాశం చాలా తక్కువ.కానీ ప్రతిరోజు వేయించిన ఆహారం తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఇలాంటి ఆహారాన్ని జీర్ణం చేసుకోలేదు.ఇలాంటి ఆహారం నిదానంగా మీ మూత్రపిండాలు, కాలేయాన్ని దెబ్బ తీసే అవకాశం ఉంది.అలాగే ఇది మీ చర్మ ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది.అందువల్ల వేయించిన ఆహారాలకి దూరంగా ఉండటం ఆరోగ్యానికి చాలా మంచిది.తెల్ల చక్కెరను చాలామంది ఆరోగ్య నిపుణులు వైట్ పాయిజన్ అని చదువుతారు.
వైట్ షుగర్ ఎక్కువగా ఆహార పదార్థాలలో తీసుకోవడం వల్ల నేరుగా టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.దీనితోపాటు కొల్లాజెన్ స్థాయి కూడా పెరగడం వల్ల శరీరం వదులుగా మారిపోతుంది.
అలాంటివారు ఏ చిన్న పని చేసినా త్వరగా అలసిపోయి నీరసపడే అవకాశం ఉంది.