ఈ సింపుల్ చిట్కాలతో మొటిమల తాలూకు మచ్చలను సులభంగా వదిలించుకోండి!

మొటిమలు( pimples )సమయం సందర్భం లేకుండా పనిగట్టుకుని మరీ వచ్చి వేధించే చర్మ సమస్యల్లో ఒకటి.అయితే కొందరికి మొటిమలు తగ్గినా వాటి తాలూకు మచ్చలు మాత్రం అలాగే ఉండిపోతాయి.

 Get Rid Of Acne Scars Easily With These Simple Tips! Simple Tips, Acne Scars, Ac-TeluguStop.com

వాటిని ఎలా వదిలించుకోవాలో తెలియక ముప్పతిప్పలు పడుతుంటారు.మీరు ఈ లిస్టులో ఉన్నారా? అయితే డోంట్ వర్రీ.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాలతో మొటిమల తాలూకు మచ్చలను సులభంగా వదిలించుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సింపుల్ చిట్కాలు ఏంటో ఓ చూపు చూసేయండి.

దాల్చిన చెక్క మొటిమలు, వాటి తాలూకు మచ్చలను సమర్థవంతంగా నివారిస్తుంది.అందుకోసం ఒక బౌల్ లో వన్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని చ‌ర్మంపై అప్లై చేసుకుని కాస్త డ్రై అయిన అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.రోజుకు ఒకసారి ఇలా చేస్తే మొటిమలు, వాటి తాలూకు మచ్చలు దెబ్బకు పరారవుతాయి.

Telugu Acne Scars, Acnescars, Tips, Clear Skin, Simple Tips, Skin Care, Skin Car

అలాగే ఒక బౌల్ తీసుకొని అందులో ఐదు టేబుల్ స్పూన్లు కొబ్బరి పాలు( Coconut Milk ), ఐదు టేబుల్ స్పూన్లు టమాటో జ్యూస్ వేసుకుని రెండు కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఇందులో షీట్ మాస్క్ ను ముంచి దానిని ముఖంపై పెట్టుకోవాలి.ప‌దిహేను నిమిషాల తర్వాత షీట్ మాస్క్‌ ను తొలగించి ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా చేసినా సరే మొటిమలు తాలూకు మచ్చలు కొద్ది రోజుల్లోనే మాయమవుతాయి.

Telugu Acne Scars, Acnescars, Tips, Clear Skin, Simple Tips, Skin Care, Skin Car

మొటిమల తాలూకు మచ్చలు తొలగించడానికి మరొక పవర్ ఫుల్ రెమెడీ కూడా ఉంది.అందుకోసం ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ వైల్డ్‌ టర్మరిక్ పౌడర్, రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloe Vera Gel ) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని నిద్రించే ముందు చర్మానికి అప్లై చేసుకొని ఉదయాన్నే గోరువెచ్చని నీటితో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా రెగ్యులర్ గా చేస్తే మొటిమలు తాలూకు మచ్చలు చాలా వేగంగా తగ్గుముఖం పడతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube