A.R Rahman kadapa dargah celebrations : కడప దర్గా ఉత్సవాలలో పాల్గొన్న ఎ. ఆర్ రెహమాన్.. ఫోటో వైరల్!

A R Rahman Participated In The Kadapa Dargah Celebrations Photo Viral A.R Rahman ,participated , Kadapa, Dargah Celebrations , Ameen Peer Mosque

ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కడప అమీన్ పీర్ పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.ప్రతి ఏడాది జరిగే ఈ ఉత్సవాలలో భాగంగా వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కలు చెల్లించుకుంటారు.

 A R Rahman Participated In The Kadapa Dargah Celebrations Photo Viral A.r Rahman-TeluguStop.com

ఈ క్రమంలోనే భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేశారు.ఇకపోతే ఈ ఉత్సవాలలో ప్రధాన ఘట్టమైన గంధం మహోత్సవ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ఎంతోమంది సెలబ్రిటీలు సైతం హాజరవుతూ ఉంటారు.

ఈ క్రమంలోనే ప్రతి ఏడాది కడపలో జరిగే అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాలలో తప్పనిసరిగా ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ హాజరవుతారు.

ఈ క్రమంలోనే ఈ ఏడాది జరిగిన ఉరుసు ఉత్సవాలలో భాగంగా ఈయన గంధం మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.450 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ కడప అమీన్ పీర్ పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలకు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతారు.

Telugu Ar Rahman, Andrapradesh, Dargah, Kadapa-Movie

కేవలం ముస్లిం భక్తులు మాత్రమే కాకుండా మతాలకు అతీతంగా ఈ ఉత్సవాలలో పాల్గొని భక్తుల సందడి చేస్తుంటారు.ఇక సెలబ్రిటీల తాకిడి కూడా ఉండడంతో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను ఎంతో పకడ్బందీగా నిర్వహించారు.ఇక సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతల సంపాదించుకున్న ఏఆర్ రెహమాన్ ప్రతి ఏడాది కడప దర్గా ఉరుసు ఉత్సవాలలో సందడి చేస్తూ ఉంటారు.ఇక ఈ ఏడాది కూడా ఈ ఉత్సవాలలో ఈయన పాల్గొన్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube