శీతాకాలం రాగానే మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి వేగంగా తగ్గిపోవడం వల్ల అనేక రకాల వ్యాధులు మనల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటాయి.శరీరం రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఆహారంలో డ్రై ఫ్రూట్స్ను చేర్చుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సలహాలు చెబుతూ ఉంటారు.
వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.కాబట్టి పొట్టకు సంబంధించిన సమస్యలను దూరం చేసే అవకాశం ఉంది.
శరీరం జీర్ణవ్యవస్థను పునరుద్ధరించడం ద్వారా సీజనల్ వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.సాధారణంగా డ్రై ఫ్రూట్స్ ఖరీదైనవిగా ఉంటాయి.
దీనికి బదులుగా మీరు అతి పండ్లను తినడం మంచిది.అంజీర్ కూడా ఒక రకమైన డ్రైఫ్రూటే.
ఇందులో పోషకాలు కూడా ఎక్కువగానే ఉంటాయి.ఇది మన శరీరానికి ఉపయోగకరంగా ఉంటుంది.కానీ కొన్ని వ్యాధులతో బాధపడుతున్న వారు అత్తి పండ్లను అస్సలు తినకూడదు.తింటే మాత్రం ఆ సమస్యలు ఇంకా పెరిగే అవకాశం ఉంది.
కిడ్నీలో రాళ్లతో బాధపడేవారు అత్తిపండ్లను అసలు తినకూడదు.వాటిలో ఆక్సలైట్ అనే మూలకం అత్తిపండ్లలో ఉండటం వల్ల కిడ్నీలలో రాళ్ల సమస్యను ఇంకా పెరిగే అవకాశం ఉంది.

అతి పండ్లను జీర్ణవ్యవస్థకు చాలా ప్రయోజనకరంగా చెబుతూ ఉంటారు.అయితే జీర్ణ వ్యవస్థ సమస్యలతో బాధపడే వారు అత్తిపండ్లను అధికంగా తీసుకోవడం మానేయాలి.ఎందుకంటే ఈ సమయంలో ఈ పండ్లను అధికంగా తీసుకోవడం వల్ల పొట్ట సమస్యలు, కడుపునొప్పి కూడా పెరిగే అవకాశం ఉంది.దంతక్షయం సమస్యతో బాధపడుతున్న రోగులు అత్తి పండ్లను అసలు తినకూడదు.

ఎందుకంటే అత్తిపండ్లలో చక్కెర అధికంగా ఉంటుంది.దీని కారణంగా దంత క్షయం వేగంగా పెరగడం మొదలవుతుంది.పంటి నొప్పి కూడా పెరిగే అవకాశం ఉంది.మైగ్రేన్ తో బాధపడుతున్న రోజులు అత్తిపండ్లకు దూరంగా ఉండడం మంచిది.ఎందుకంటే ఇందులో ఉండే సల్ఫేట్ మైగ్రేన్ సమస్యను మరింత పెంచుతుంది.తలనొప్పి సమయంలో కూడా అతి పండ్లను తినకూడదని తింటే సమస్య మరీ ఇంత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.







