సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది.రోజు రోజుకు ఎండలు ముదిరిపోతున్నాయి.
భానుడు భగ భగలకు ప్రజలు విల విల మంటున్నారు.మిగిలిన సీజన్స్‌తో పోల్చితే.
ఈ వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు కారణంగా నీరసం, అలసట, చికాకు చాలా ఎక్కువగా ఉంటాయి.వేసవి వేడి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే.
ఖచ్చితంగా కొన్ని కొన్ని ఆహారాలను డైట్‌లో చేర్చుకోవాల్సి ఉంటుంది.అలాంటి వాటిలో పనస పండు కూడా ఒకటి.
వేసవిలో పనస పండు తినడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చు.
విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం, సోడియం, ఐరన్, జింక్, ప్రోటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోషకాలు పనస పండులో నిండి ఉంటాయి.
అందుకే పనస పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా వేసవిలో పనస పండు తీసుకోవడం వల్ల వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది.
అలాగే వేసవి కాలంలో ఎండల దెబ్బకు తరచూ నీరస పడిపోతూ ఉంటాము .అయితే పనస పండును తీసుకుంటే.అందులో ఉండే సుక్రోజ్ మరియు ఫ్రక్టోజ్‌లు తక్షణ శక్తిని అందించి నీరసాన్ని దూరం చేస్తాయి.మరియు అలసట, ఒత్తిడి, తలనొప్పి వంటి సమస్యలు కూడా తగ్గు ముఖం పడతాయి.
వేసవిలో వేధించే డీహైడ్రేషన్ సమస్యను నివారించడంలోనూ పనస పండు ఉపయోగపడుతుంది.

అందువల్ల, ప్రతి రోజు తగిన మోతాదులో పనస పండు తీసుకుంటే మంచిది.అయితే మధుమేహం ఉన్న వారు ఎక్కడ షుగర్ లెవల్స్ పెరిగిపోతాయో అన్న భయంతో పనస పండు తీసుకోవడానికి భయపడుతుంటారు.నిజానికి షుగర్ లెవల్స్‌ను అదుపు చేయడంలో పనస పండులో ఉండే ఫైబర్ గ్రేట్‌గా సహాయపడుతుంది.
కాబట్టి, మధుమేహం వ్యాధి గ్రస్తులు కూడా ఎలాంటి భయం లేకుండా పనస పండు తీసుకోవచ్చు.అయితే అతిగా మాత్రం పనస పండును తీసుకోరాదు.