ఈ హోమ్ మేడ్ సిరప్ ను తీసుకుంటే దగ్గు దెబ్బకు పరార్ అవుతుంది

ప్రస్తుత చలికాలంలో అత్యధికంగా వేధించే సమస్యల్లో దగ్గు ముందు వరుసలో ఉంటుంది.వాతావరణంలో వచ్చే మార్పులు అందుకు ప్రధాన కారణం.

 Homemade Cough Syrup Is For You! Homemade Cough Syrup, Cough Syrup, Cough, Lates-TeluguStop.com

ఏదేమైనప్పటికీ దగ్గు ఒక్కసారి పట్టుకుంది అంటే అంత సులభంగా వదిలిపెట్టదు.దగ్గు కారణంగా తీవ్రమైన అసౌకర్యానికి గురవుతుంటారు.

ఒక్కోసారి దగ్గు వల్ల రాత్రుళ్లు నిద్ర కూడా ఉండదు.ఈ క్రమంలోనే దగ్గు ను వదిలించుకోవడం కోసం చాలామంది మెడికల్ షాప్ లో లభ్యం అయ్యే సిరప్స్ ను వాడుతుంటారు.

అయితే వాటి వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది అన్నది పక్కన పెడితే.ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ సిరప్ దగ్గును మూడే మూడు రోజుల్లో తరిమి కొడుతుంది.

ఈ సిరప్ ను రోజుకు రెండు సార్లు తీసుకుంటే ఎంత తీవ్రమైన దగ్గు అయినా దెబ్బకు పరారవుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం దగ్గు ను నివారించే ఆ సిరప్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా అంగుళం అల్లం ముక్క‌ను తీసుకుని శుభ్రంగా పొట్టు తొలగించి వాటర్ తో కడగాలి.ఇలా కడిగిన అల్లం ముక్కను సన్నగా తురుముకోవాలి.ఈ తురుము నుంచి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్‌ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు అల్లం జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ తేనె, చిటికెడు మిరియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

అంతే మన సిరప్ సిద్ధమవుతుంది.ఈ హోం మేడ్ సిరప్ దగ్గు ను నివారించడంలో చాలా పవర్ ఫుల్ గా పనిచేస్తుంది.

Telugu Cough, Cough Syrup, Tips, Homemadecough, Latest, Syrup-Telugu Health Tips

ఈ సిరప్ ను ఉదయం ఒక‌సారి, నైట్ నిద్రించే ముందు ఒకసారి తీసుకోవాలి.దాంతో అల్లం, మిరియాలు మరియు తేనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ద‌గ్గును చాలా అంటే చాలా వేగంగా తగ్గిస్తాయి.ఈ సిరప్ ను తీసుకోవడం వల్ల జలుబు సమస్య ఉన్న సరే దూరమవుతుంది.శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది.అదే సమయంలో రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.కాబట్టి దగ్గు సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ హోమ్ మేడ్ సిరప్ ను తీసుకునేందుకు ప్రయత్నించండి.

దగ్గు ను సహజంగానే తరిమికొట్టండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube