మన దేశంలో ఎన్నో ప్రధానమైన దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.వీటిని దర్శించుకోవడానికి ప్రతి రోజు ఎన్నో వేల మంది భక్తులు అక్కడికి వచ్చి వెళుతూ ఉంటారు.
మన దేశంలో ఇలా ఉన్న అనేక పురాతన దేవాలయాలకు, పుణ్యక్షేత్రాలకు పేర్లు అనేవి ఎన్నో కారణాల వల్ల ఏర్పడి ఉంటాయి.అలాగే ఒక ప్రాంతానికి ఒక పేరు రావడం వెనుక పెద్ద నేపథ్యమే ఉంటుంది.
అలా ప్రతి ప్రాంతానికి కచ్చితంగా ఒక చరిత్ర అనేది ఉంటుంది.అలాంటి వాటిలో నిత్యం ఎంతో మంది దర్శించుకునే మహాబలిపురానికి ముందు ఏ పేరు ఉండేదో, ఎందుకు ఆ పేరు మార్చాల్సి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక వైపున చరిత్ర మరో వైపున ఆధ్యాత్మికత పెను వేసుకుపోయి కనిపించే ప్రదేశమే మహాబలిపురం ఇక్కడి చరిత్రను ప్రకృతి అందాల మధ్య దర్శించడం.ఇక్కడి ఆధ్యాత్మికతను ప్రకృతి అందాల నడుమ స్పర్శించడం అనిర్వాచనీయమైన అనుమతిని కలిగిస్తూ ఉంటుంది.ఈ పుణ్యక్షేత్రానికి మహా బలిపురం అనే పేరు రావడానికి గల కారణంగా ఇక్కడ అనేక కథలు వినిపిస్తూ ఉంటాయి.మహాబలి అనే రాజు పరిపాలించిన ప్రదేశం కావడం వలన మహాబలిపురం పేరు వచ్చిందని ఇక్కడి ప్రజలు, స్థానికులు చెబుతూ ఉంటారు.
ఇంకా చెప్పాలంటే పల్లవ రాజులలో ప్రముఖుడిగా చెప్పబడిన నరసింహ వర్మ కు పల్లవమల్ల అనే బిరుదు కూడా ఉండేది.చాళుక్యరాజు పులకిసిని ఓడించడం వలన నరసింహ వర్మకి ఈ బిరుదు వచ్చిందని చరిత్ర చెబుతోంది.ఆయన ఇక్కడ ఎన్నో అద్భుతమైన కట్టడాలను నిర్మించాడు.కాబట్టి ఆయన పేరు మీదగా ఈ ప్రాంతాన్ని మా మల్లాపురం అని పిలుస్తూ ఉండేవారు.అది కాలక్రమంలో ప్రసిద్ధి చెంది మామళ్ళపురం గా ప్రసిద్ధి చెందింది.ఈ ప్రాంతాన్ని మహాబలిపురం గా పిలుస్తూ వస్తున్నారు.