స్త్రీల అలంకారములు పదహారు... అవి ఏమిటి?

స్త్రీలు అంటేనే అలంకారం. ఆడవాళ్లు అందంగా ముస్తాబు అవకుండా పక్కనున్న గల్లీకి కూడా వెళ్లరు.

 What Are They Womens Jewellery Is Sixteen , Ladies Make Up , Padaharu Alankara-TeluguStop.com

ఇక పెళ్లిళ్లు, పేరంటాలు, శుభకార్యాలు ఉంటే చెప్పాల్సిన పనే లేదు. చీర కట్టుకోవడం దగ్గర నుంచి లిప్ స్టిక్ అద్దుకోవడం వరకూ అన్నీ మ్యాచింగే కావాలి.

అందులో ఏది తక్కువైనా వాళ్లు తట్టుకోలేరు.అంతే కాదండోయ్ అద్దం ముందే గంటలు గంటలు కూర్చొని సింగారించుకుంటారు.

తమను తాము అందంగా అలంకరించుకొని మురిసిపోవడమే కాకుండా అందరి ముందూ హుందాగా కనిపించాలని తహతహలాడిపోతుంటారు.అందుకే పురాణ కాలం నుంచి మన స్త్రీలకు అలంకారాలు పదహారు ఉంటాయని చెప్తుంటారు.

అయితే వారు అందంగా కనిపించాలంటే ఈ పదహారు అలంకారాలు తప్పని సరి అని కూడా వివరిస్తుంటారు.అయితే అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1.దంత ధావనము, 2.నలుగు పెట్టి స్నానము, 3.పసుపు పూత, 4.చీర, రవిక, 5.పారాణి, 6.శిరోజాలంకరణ, 7.పుష్పాలంకరణ, 8.పాపిట కుంకుమ, 9.బుగ్గన చక్కటి చుక్క, 10.లలాట తిలకము, 11.గోరింటాకు, 12.తాంబూలము, 13.పెదవులకి ఎరుపు రంగు.అంటే లిప్ స్టిక్, 14.కంటికి కాటుక, 15.సర్వాభరణ అలంకరణ, 16.పెళ్ళి అయిన వారికి మంగళ సూత్రమూ, నల్ల పూసలూ, మెట్టెలు. ఇవన్నీ పెట్టుకుంటేనే ఆడ వాళ్ల అలంకరణ పూర్తి అయినట్లు.ఇందులో ఏది తక్కువ అయినా స్త్రీలు నిండుగా కనిపించరు.అందుకే వారిని అందంగా అలంకరించుకోనివ్వండి.చూసి మీరు కూడా మురిసిపోండి.

వారు అందంగా కనిపిస్తేనే కదా మీకు కూడా గౌరవం.అందుకే వాళ్లకు కాస్త టైం ఇవ్వండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube