మనకు ప్రతి రోజు నిద్రపోయిన తర్వాత ఎన్నో కలలు ( Dreams ) వస్తూ ఉంటాయి.ఆ కలలలో పక్షులు, జంతువులు, సముద్రాలు, మనుషులు ఇలా ఎన్నో రకాల కలలను మనం చూస్తూ ఉంటాం.
కొన్ని కలలు అర్ధరాత్రి వస్తే మరికొన్ని తెల్లవారు జామున వస్తాయి.ఏ కల అయిన కూడా అది భవిష్యత్తులో మనకు ఏదో ఒక సంకేతాన్ని సూచిస్తుంది.
స్వప్న శాస్త్రం ప్రకారం ప్రతి కలలో ఒక నిర్దిష్టమైన అర్థం దాగి ఉంటుంది.అలాగే కలలో కోతి ( Monkey ) కనిపిస్తే శుభమ అ శుభమా అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే కలలో కోతులు పోట్లాడుకోవడం చూస్తే భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండాలని స్వప్న శాస్త్రం తెలియజేస్తుంది.ఎందుకంటే అలాంటి కలలు వస్తే కుటుంబంలో గొడవలు( Family Disputes ) జరిగే అవకాశం ఉందని అర్థం.అలాగే కలలో కోతి ఈత కొడుతున్నట్లు కనిపిస్తే వచ్చే సమయం మీకు అనుకూలమని అర్థం.అలాంటి కల వస్తే మీకు అదృష్టం వర్తిస్తుందని సూచిక.ఇంకా చెప్పాలంటే జీవితంలోని సమస్యల నుండి ఉపశమనం కూడా పొందుతారని పండితులు చెబుతున్నారు.అయితే కలలో కోతి కరించినట్లు కల వస్తే భవిష్యత్తులో ఏదైనా తీవ్రమైన గాయం అవుతుందని అర్థం చేసుకోవాలి.
ఇక స్వప్న ప్రకారం కలలో తింటున్న కోతినీ( Monkey Eating ) చూస్తే అశుభ సంకేతంగా పరిగణిస్తారు.అలాగే కోపంతో ఉన్న కోతిని చూస్తే కూడా అ శుభ సంకేతంగా పరిగణిస్తారు.ఇలాంటి కల్లులు వస్తే ఆర్థిక నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.అలాగే కలలో కోతి నవ్వుతున్నట్లు కనిపిస్తే మీకు మీ జీవితంలో మంచి సమయం ఆసన్నమవుతుందని అర్థం.
ఇక కోతి సంతోషంగా ఉన్నట్లు కల వస్తే కూడా శుభ పరిణామంగా చెబుతారు.ఇలాంటి కల వస్తే మీ జీవితంలో గౌరవం ఆదాయం పెరుగుతుందనీ స్వప్న శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.