మహాభారతం అనగానే మనకు కౌరవులు పాండవుల మధ్య 18 రోజుల పాటు అతి భీకరంగా జరిగిన కురుక్షేత్ర యుద్ధమే గుర్తొస్తుంది.యుద్ధంలో కౌరవులు వందమంది చనిపోతారు.
అసలు ఈ యుద్ధం కురుక్షేత్రం అనే ఏ ప్రదేశంలో జరగడం వల్ల కురుక్షేత్రయుద్ధంగా మారిపోయింది.పథకం ప్రకారమే ధృతరాష్ట్రుడు కావాలని కురుక్షేత్ర ప్రాంతంలో జరగాలని నిర్ణయించాడు.
ఈ విధంగా యుద్ధం కురుక్షేత్రంలో జరగడానికి గల కారణాలు ఏమిటి? ధృతరాష్ట్రుడు ఎందుకు ఆ స్థలాన్ని ఎంచుకున్నాడు? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
హర్యానా రాష్ట్రంలో కురుక్షేత్రం అనే ప్రాంతం ఉంది అనే సంగతి మనకు తెలిసిందే.
పురాణాల ప్రకారం కురు అనే రాజు ఈ ప్రాంతానికి వచ్చాడు.ఈ ప్రాంతం చుట్టూ ఎనిమిది నదులు ప్రవహించడం చూసిన ఆ రాజు తన బంగారు రథం నుంచి కిందకు దిగి ఒక నాగిలిని తయారు చేశాడు.
ఆ తరువాత ఆ పరమ శివుని పూజించి అతని ఆజ్ఞ మేరకు అతని వాహనమైన నందిని, యముడు ఆజ్ఞమేరకు యముడి వాహనమైన మహిషాన్ని తీసుకువచ్చి వాటిని నాగలికి కట్టి ఇక్కడ భూమిని దున్నటం మొదలుపెట్టాడు.అదే సమయంలోనే అక్కడికి వచ్చిన ఇంద్ర దేవుడు కురురాజును ఉద్దేశించి ఏం చేస్తున్నావ్? అని అడగగా అందుకు రాజు సత్యము, దయ, క్షమ, దానము, స్వచ్ఛత, నిష్కామము, బ్రహ్మచర్యము, యోగము అనే ఎనిమిది పంటలను పండించడానికి వ్యవసాయం చేస్తున్నానని తెలిపారు.
మరి కొద్ది సమయానికి విష్ణుదేవుడు వచ్చి అదే ప్రశ్న అడిగాడు.మరి విత్తనాలు నీలో ఉంటే అవి చూపించు అని విష్ణుదేవుడు అడగగ అందుకు కురురాజు తన శరీరాన్ని విష్ణుమూర్తికి అప్పగించడంతో తన సుదర్శన చక్రంతో ముక్కలుగా ఖండిస్తున్నప్పటికీ కురురాజు ఏమాత్రం అడ్డు చెప్పకపోవడం వల్ల విష్ణువు అతనిని మెచ్చుకొని ఏం వరం కావాలో కోరుకోమని అడిగాడు.అతను మరణించిన తరువాత ఈ ప్రాంతం తన పేరు మీదుగా వర్ధిల్లాలని, ఈ ప్రాంతంలో మరణించినవారికి స్వర్గ ప్రాప్తి కలగాలని విష్ణుదేవుని ప్రార్థించాడు.ఈ క్రమంలోనే అప్పటినుంచి ఈ ప్రాంతం కురుక్షేత్రంగా మారిపోయింది.
ఇక మహాభారతం విషయానికొస్తే పాండవులు, కౌరవులు మధ్య యుద్ధం ఎక్కడ నిర్వహించాలనే చర్చ వచ్చినప్పుడు అందుకు దృతరాష్ట్రుడు కురుక్షేత్రంలో యుద్ధం జరగాలని నిర్ణయించాడు.దృతరాష్ట్రుడి ఈ విధంగా యుద్ధం ఆ ప్రాంతంలో నిర్ణయించడం వెనుక అసలు కారణం ఏమిటంటే.
ఎన్నో పాపాలను చేసిన కౌరవులు తప్పకుండా యుద్ధంలో మరణిస్తారు.మరణించిన అనంతరం వారికి స్వర్గ ప్రాప్తి కలగాలనే ఉద్దేశంతోనే యుద్దాన్ని కురుక్షేత్రంలో నిర్ణయించాడని పురాణాలు చెబుతున్నాయి.
DEVOTIONAL