మంగళం అంటే శుభప్రదం శోభయా మానం.సూత్రం అంటే తాడు ఆధారమని అర్థం.
వివాహం అయినా మహిళకి అందం, ఐశ్వర్యం మెడలోనీ తాళిబొట్టే.మంగళ సూత్రం భార్యాభర్తల శాశ్వత అనుబంధానికి గుర్తు అనే పెద్దవారు చెబుతూ ఉంటారు.
వైవాహిక జీవితంలో ఉండే సమస్త కీడును తొలగిస్తుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.శక్తి స్వరూపిణి అయిన మహిళా మెడలో మంగళసూత్రం ఉన్నంతవరకు భర్త ఆరోగ్యంగా ఉంటాడని నమ్ముతారు.
చాలామంది మంగళసూత్రం వేసుకోవడం మానేస్తున్నారు.వారి సంగతి అలా ఉంచితే హిందూ సంప్రదాయాల( Hindu traditions )పై విశ్వాసంతో మంగళసూత్రం వేసుకునే మహిళలు కూడా తమకు తెలియకుండా కొన్ని పొరపాట్లు కూడా చేస్తున్నారు.

ఇంతకీ మంగళసూత్రం( Mangalsutra ) ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే వివాహమైన మహిళ మంగళసూత్రం వక్షస్థలం కింద వరకు ఉండాలి.సౌభాగ్యానికి ప్రతికలైనా పసుపు కుంకుమను నిత్యం మంగళ సూత్రాలకు పెట్టుకోవాలి.చాలా మంది మంగళసూత్రాలు ముత్యాలు, అమ్మవారి రూపు పెట్టుకుంటారు.ఇవి అందంగా ఉంటాయి.కానీ మంగళ సుత్రాలకు ఉండకూడదని పండితులు చెబుతున్నారు.
మంగళ సూత్రానికి ఇరువైపులా ఎరుపు, నలుపు పూసలు తప్పకుండా ఉండాలి.

ఇంకా చెప్పాలంటే చాలా మంది మంగళసూత్రానికి పిన్నిసులు పెడుతూ ఉంటారు.కానీ అసలు మంగళ సూత్రాలకు ఇనుము వస్తువులు తాకకూడదు.ఎందుకంటే ఇనుము ( Iron )నెగిటివ్ ఎనర్జీని గ్రహిస్తుంది.
దీంతో బంధం మధ్య అన్యోన్యత లోపిస్తుందని పెద్దవారు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే మంగళసూత్రాలకు ముత్యం, పగడం యాడ్ చేయడం కూడా మంచిదే.
కుజుడు, చంద్రుడికి ప్రతీకలైన ఈ రెండు రాళ్లు గ్రహ దోషాలను తొలగించి వైవాహిక బంధాన్ని మరింత పటిష్టం చేస్తాయని ప్రజలు నమ్ముతారు.సాధారణంగా మహిళలకు పూజ గ్రహ ప్రభావం వల్ల అతి కోపం, కలహాలు, మొండితనం, అనారోగ్యం గ్రహ దోషాలు ఏర్పడతాయి.
పగడం, ముత్యం( Coral pearl ) ధరించడం వల్ల వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది.ఏ ఇంట్లో అయినా మహిళ ప్రశాంతంగా ఉంటే అంతకుమించిన ఆనందం ఉండదు.