ఆహారపు అలవాట్లు, జీవన శైలిపై మన ఆరోగ్యం మరియు అవయవాల పనితీరు ఆధారపడి ఉంటాయి.అయితే కొన్ని కొన్ని అలవాట్లు మనకు తెలియకుండానే మనకు శత్రువుగా మారుతుంటాయి.
అవయవాల పనితీరును దెబ్బతీస్తాయి.కిడ్నీలను కూడా డ్యామేజ్ చేస్తాయి.
అసలు ఎటువంటి అలవాట్లు కిడ్నీ డ్యామేజ్ ( Kidney damage )కు కారణం అవుతాయి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.కొందరు వాటర్ సరిగ్గా తాగరు.
దాహం వేసిన సరే నీరు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తుంటారు.తగినంత నీరు తాగకపోవడం వల్ల డీహైడ్రేషన్ ఏర్పడుతుంది.
డీహైడ్రేషన్ మీ కిడ్నీలు సరిగా పని చేయకుండా చేస్తుంది.
అలాగే ఇటీవల రోజుల్లో ఏదో ఒక కారణం చేత చాలా మంది స్మోకింగ్ కు అలవాటు పడుతున్నారు.అయితే స్మోకింగ్ అలవాటు అధిక రక్తపోటు మరియు టైప్ 2 డయాబెటిస్‌ను( Type 2 diabetes ) మరింత తీవ్రతరం చేస్తుంది, ఇవి మూత్రపిండాల వ్యాధికి ప్రధాన కారణాలుగా మారతాయి.కొందరు యూరిన్( Urine ) ను గంటలు తరబడి ఆపుకుంటూ ఉంటారు.
ఇటువంటి అలవాటు మీకు ఉంటే కనుక కచ్చితంగా మానుకోండి.కిడ్నీలు డ్యామేజ్ అవ్వడానికి ఇదీ ఒక కారణం.
మనలో చాలా మందికి ముక్క లేనిదే ముద్ద దిగదు.అయితే మాంసం ( meat ) ఎక్కువగా తినే వారిలో కిడ్నీ సమస్యలు అధికంగా తలెత్తుతాయి.
మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా తాగే వారు ఎందరో ఉన్నారు.అయితే అధికంగా మద్యపానం ( drinking )చేయడం వల్ల దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి వచ్చే ప్రమాదాన్ని రెట్టింపు అవుతుంది.కొందరు షుగర్ ను ఎక్కువగా వాడుతుంటారు.చక్కెర ఊబకాయానికి దోహదం చేస్తుంది, ఇది మీ అధిక రక్తపోటు మరియు మధుమేహం ప్రమాదాన్ని పెంచుతుంది.ఫలితంగా మూత్రపిండాలు దెబ్బతింటాయి.పెయిన్ కిల్లర్స్‌ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల మీ కిడ్నీలు దెబ్బతింటాయి మరియు కిడ్నీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
నిద్రను నిర్లక్ష్యం చేయడం వల్ల కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి.నిద్రలో మీ మూత్రపిండాలు తమ కణజాలాలను పునరుద్ధరిస్తాయి, కాబట్టి తగినంత నిద్ర పొందకపోవడం దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధికి దారితీస్తుంది.
అంతే కాకుండా రోజుకు రెండు లేదా అంతకంటే ఎక్కువ కూల్ డ్రింక్స్ తాగడం, ఎక్కువ ఉప్పు తినడం వల్ల కూడా కిడ్నీ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది.