గోవా అనగానే ముందుగా సముద్ర తీరాన ఉన్న ప్రకృతి అందాలు గుర్తొస్తాయి.గోవా కేవలం ప్రకృతి అందాలకు మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక మందిరాలు కూడా ఎంతో ప్రాముఖ్యత చెందిందని చెప్పవచ్చు.
అతి తక్కువ జనాభా కలిగి ఉన్న ఈ రాష్ట్రంలో ఎన్నో మందిరాలకు కొలువై ఉందని చెప్పవచ్చు.త్రిమూర్తులలో ఒకరైన పరమేశ్వరుడు సాక్షాత్తూ నిర్మించిన శ్రీ మంగేశి మందిరం ఈ గోవాలోనే ఉంది.
అయితే ఈ ఆలయ నిర్మాణ చరిత్ర గురించి ఇక్కడ తెలుసుకుందాం…
పురాణాల ప్రకారం ఒకసారి కైలాసంలో ఆ పరమశివుడు తో ఆటలాడుతూ ఉండగా పార్వతీ చేతిలో ఓటమి పాలైన శివుడు కైలాసం వదిలి ఈ ప్రాంతానికి వచ్చి కొలువై ఉన్నాడు.దీంతో పార్వతీదేవి ఆ పరమేశ్వరుని వెతుకుతూ ఈ ప్రాంతానికి చేరుకున్నారు.
ఈ ప్రాంతంలో పార్వతీదేవిని చూసిన పరమేశ్వరుడు ఓ పులి రూపంలో పార్వతీదేవి ముందుకు వచ్చారు.ఒక్కసారిగా పులిని చూడటంతో పార్వతిదేవి ఎంతో భయాందోళన చెందుతారు.
కొద్ది సేపటికి తేరుకున్న తర్వాత “త్రాహి మాం గిరీశ” అంటూ ప్రార్థించింది.అంటే దీనర్థం పర్వతాలకు రాజైన ఓ ప్రభువా నన్ను రక్షించని.
పార్వతి దేవి ఈ విధంగా వేడు కొనడంతో పులి రూపంలో ఉన్న పరమ శివుడు తన నిజస్వరూపంలో పార్వతీదేవికి కనిపిస్తాడు.ఒక్కసారిగా పరమశివుని చూడటంతో పార్వతీదేవి ఆనందానికి అంతులేకుండా పోయింది.
మాం గిరీశీ అన్న పదమే కాలక్రమంలో మంగేశ్‌గా మారింది.

జువారి నది ఒడ్డున పరమశివుడు ప్రత్యక్షమైన చోటే ఆలయాన్ని నిర్మించారు.అయితే ఈ ఆలయాన్ని పోర్చుగీసు వారు ఆక్రమించడంతో అక్కడ ఉన్న శివలింగాన్ని సమీపంలో ఉన్న ప్రియల్‌కు తరలించి నాలుగు శతాబ్దాల వరకు అక్కడే పూజలను నిర్వహించారు.తరువాత 18 వ శతాబ్దంలో మరాఠా సైన్యాధికారి రామచంద్ర సుక్తాంకర్ ఆలయాన్ని నిర్మించి తిరిగి శివలింగాన్ని అక్కడే ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తున్నారు.
ఇక్కడ ఉన్న ప్రధాన ఈశ్వరాలయం తో పాటు అనేక ఉప ఆలయాలు కూడా ఉన్నాయి.