15 అడుగుల లోతున బయటపడిన విష్ణుమూర్తి విగ్రహం.. చూసేందుకు భారీగా వచ్చిన జనం..

మన భారతదేశంలోని బీహార్ రాష్ట్రంలోనీ గోపాల్ గంజ్ రైల్వే లైన్ కోసం జరుపుతున్న తవ్వకాలలో నాలుగు అడుగుల ఎత్తైన విష్ణు మూర్తి విగ్రహం లభ్యమయింది.ఈ అష్టధాతు విగ్రహం చాలా పురాతనమైనదని అక్కడి స్థానికులు భావిస్తున్నారు.

 Vishnu Murthy Statue That Came Out From A Depth Of 15 Feet.. Huge Crowd Came To-TeluguStop.com

అయితే పోలీసులు ఈ విగ్రహాన్ని స్వాధీనం చేసుకొని పురావస్తు శాఖకు విచారణ నిమిత్తం తరలించారు.పోలీస్ స్టేషన్ పరిధిలోని మోహన్‌పూర్ గ్రామ సమీపంలో రైలు మార్గం వెంట జెసిబి తో మట్టిని తవ్వుతున్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు.

ఈ నేపథ్యంలో భూమి 15 అడుగుల లోతున పురాతన విష్ణుమూర్తి విగ్రహం లభ్యమైందని పోలీసులు వెల్లడించారు.విగ్రహం గురించి సమాచారం అందిన వెంటనే అక్కడికి పెద్ద సంఖ్యలో జనం గుమి గుడి పూజలు కూడా చేశారు.సమాచారం అందుకున్న పోలీసులు కూడా ఘటన స్థలానికి చేరుకుని విగ్రహాన్ని స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు.గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం సుమారు నాలుగు అడుగుల ఈ విగ్రహం నలుపు రంగులో ఉంది.

చూడగానే ఆ విగ్రహం విష్ణుమూర్తిది అని తెలిసిపోయింది.విగ్రహంలోని కుడి చెయ్యి విరిగిపోయి ఉంది.బరోలి స్టేషన్ ఇంచార్జ్ అశ్విని కుమార్ తివారి మాట్లాడుతూ ఈ విగ్రహం చాలా విలువైనదని అష్ట ధాతువులతో తయారు చేయబడినదని అయితే ప్రస్తుతానికి పెద్దగా వివరాల ను చెప్పలేమని వెల్లడించారు.స్థానికులు మొదట ఈ విగ్రహాన్ని చూశారు.

ఆ తర్వాత పోలీసులకు ఈ సమాచారం అందించారు.విగ్రహం చాలా పురాతనమైనదిగా కనిపిస్తున్నది.

ప్రస్తుతం పోలీసులు విగ్రహాన్ని పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ జరుగుతున్నారు.విగ్రహాన్ని విచారణ నిమిత్తం పురావస్తు శాఖకు పంపుతున్నట్లు స్టేషన్ ఇన్చార్జి వెల్లడించారు.

విచారణ తర్వాత మాత్రమే పూర్తి సమాచారం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఈ సందర్భంగా వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube