Vanitha Reddy : విజయ్ చనిపోయాక రోడ్డున పడ్డాను.. నా కూతురిని కూడా చదివించుకోలేకపోతున్నాను

కమెడియన్ విజయ్ సాయి( Vijay Sai ) అందరికి తెలిసిన నటుడే.కెరియర్లో ముందుకు వెళ్లలేక, వ్యక్తిగత జీవితం కూడా ఇబ్బందుల్లో ఉండడంతో ఒక తప్పుడు నిర్ణయం తీసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

 Vijay Sai Wife Vanitha Reddy Financial Struggles-TeluguStop.com

బొమ్మరిల్లు, అమ్మాయిలు అబ్బాయిలు, అల్లరి, కరెంటు వంటి సినిమాల్లో నటించి మంచి పేరు అయితే సంపాదించుకున్నాడు కానీ ఎందుకో కెరియర్ పరంగా అంత సక్సెస్ కాలేకపోయాడు.అయితే మరో మహిళతో అక్రమ సంబంధం ఉండటం వల్లే తన భార్య సైతం విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకొని తనకు భరణం కావాలని డిమాండ్ చేసింది.

వీరిద్దరికి ఓ కుమార్తె కూడా ఉంది.కమెడియన్ విజయ్ సాయి చనిపోయే సమయానికి వయసు 38 ఏళ్లు కాగా సీరియల్ నటి అయిన వనిత రెడ్డిని( Vanitha Reddy ) ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

కొన్నాళ్ల పాటు వీరికి కాపురం బాగానే సాగిన ఆ తర్వాత అనేక ఒడిదుడుకులు రావడంతో విడిపోవాలని నిర్ణయానికి వచ్చారు.

Telugu America, Central, Vanitha Reddy, Vijay Sai, Vijaysai-Telugu Stop Exclusiv

కానీ అందుకు విజయ్ సిద్ధంగా లేకపోవడం ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఉండటంతో అన్ని హ్యాండిల్ చేయడం తన వల్ల కాక ఆత్మహత్య చేసుకున్నాడు.ఇక్కడ వరకు అంతా ఒకే కానీ ఒక్కసారి విజయ్ సాయి మరణంతో అతని భార్య వనితా రెడ్డి పై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఆమె వల్లే అతను ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ అందరూ వేలెత్తి చూపారు.

నిజా నిజాలు ఎవరికి తెలియకపోయినా వనిత రెడ్డి పై నింద మాత్రం పడింది.కానీ అది ఎంత వరకు నిజం అని అటు వనిత రెడ్డి కుటుంబ సభ్యులకు ఇటు విజయ కుటుంబ సభ్యులకు మాత్రమే తెలిసు.

అప్పటికి విజయ్ కి అయితే కెరియర్ లేదు కాని వనిత రెడ్డి సీరియల్స్ లో బిజీగానే ఉంది.ఆమె సంపాదన తోనే తాను బ్రతుకుతుంది కూతుర్ని కూడా పెంచుకుంటుంది.

Telugu America, Central, Vanitha Reddy, Vijay Sai, Vijaysai-Telugu Stop Exclusiv

ఈ క్రమంలో ఆమెను అందరూ పక్కన పెట్టారు.ఇండస్ట్రీ పూర్తిగా దూరం పెట్టేసింది.దాంతో అవకాశాలు కోల్పోయింది… రోడ్డుపైకి వచ్చింది.ప్రస్తుతం ఆదుకునే నాధుడు లేక ఇబ్బంది పడుతోంది.నాగబాబు తన సోదరుడు చిరంజీవి ఎంపీగా ఉన్న సమయంలో వనిత కూతురికి కేంద్ర విద్యావిశ్వవిద్యాలయంలో( Central University of Education ) సీట్ ఇప్పించడం తో కాస్త కుదుటపడింది ఆమె జీవితం.కానీ ఒక్కరోజు షూట్ ఉన్న తనకు పని ఇప్పించండి అంటూ అందరిని అడుగుతోంది వనితారెడ్డి.

ఇటీవల ఇంటర్వ్యూస్ లో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుంది.ఆ రోజు విజయ్ అందర్నీ వదిలేసి బాగానే వెళ్లిపోయాడు.

తర్వాత కుటుంబ సభ్యులు కూడా అందరూ బాగానే ఉన్నారు.అమెరికాలో సెటిల్ అయ్యారు.

నేను మాత్రం ప్రతి రూపాయికి ఇబ్బంది పడుతున్నాను.తను చేసిన తప్పు నాపై పడింది.

ఆ నింద ఇప్పటికి మోస్తున్నాను.ఎవరైనా దయచేసి సహాయం చేస్తే నా కూతుర్ని ప్రశాంతంగా పెంచుకుంటారు.

నాకు డబ్బులు అక్కర్లేదు.పని మాత్రం చెప్పండి చాలు అంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube