మసాలా దినుసుల్లో దాల్చిన చెక్క అంటే ఇష్టం ఉండని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో.చిన్న దాల్చిన చెక్క పేడు నోట్లో వేసుకుని నమిలితే విభిన్నమైన ఫ్లేవర్‌తో అద్బుతమైన టేస్ట్ శరీరం మొత్తానికి తెలుస్తుంది.
ఆ తర్వాత కొన్ని నిమిషాలకు కాసిన్ని మంచినీరు తాగితే అబ్బో ఆ అనుభూతి మాటల్లో చెప్పలేం.కేవలం రుచిలోనే కాకుండా ఔషద గుణాల్లో కూడా అద్బుతమైన గొప్పదనం కలిగి ఉన్న దాల్చిన చెక్క ఒకప్పుడు వంటల్లోకి వాడటం నిషేదం.
ఎందుకంటే దాల్చిన చెక్కను దేవుడి ప్రసాదంగా భావించేవారు.అలాంటి దేవుడి ప్రసాదంను వంటల్లో వాడటం వల్ల అపవిత్రం అవుతందనేది అప్పటి వారి అభిప్రాయం.
ప్రపంచంలో ఎన్నో మార్పులు వచ్చాయి, జీవితంలో ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి.ఇలాంటి సమయంలో దాల్చిన చెక్క రోజు వారి ఆహారంలో తప్పనిసరిగా మనం ఏదో ఒక రూపంలో తీసుకుంటూనే ఉన్నాం.మసాలా దినుసుల్లో ఒక్కటిగా పేరు పొందిన దాల్చిన చెక్కను ఇచ్చే చెట్టులోని ప్రతి భాగం కూడా ఎంతో అద్బుతమైన ఔషదగుణంను కలిగి ఉంటుందని ఆయుర్వేద పండితులు చెబుతున్నారు.అది కొన్ని వందల సంవత్సరాల క్రితమే నిరూపితం అయ్యిందని, ఎవరు కూడా దాన్ని ప్రత్యేకంగా రుజువు చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు.
దాల్చిన చెక్క ఉపయోగాలు :
దాల్చిన చెక్కతో పాటు దాల్చిన చెట్టు ఆకులు కూడా ఎంతో ఉపయోగదాయకం.కాలిన గాయాలకు అద్బుతమైన ఔషదం ఈ చెట్టు ఆకు పసరు.కాలిన గాయం వద్ద ఈ ఆకు పసరు రోజుకు రెండు సార్లు పిండినట్లయితే వారం రోజుల్లోనే ప్రభావం కనిపిస్తుంది.దగ్గుకు ఎండు ఆకుల చూర్ణం అద్బుతంగా పని చేస్తుంది.
మలబద్దకం, మధుమేహం, జీర్ణ సమస్యలు ఇలా పు అనారోగ్య సమస్యలను దాల్చిన చెక్క మరియు దాల్చిన చెట్టు తొలగిస్తుంది.
దాల్చిన చెక్కను ఎక్కువగా కేరళలో పండిస్తూ ఉంటారు.అక్కడ నుండే దేశ వ్యాప్తంగా ఎగుమతి అవుతుంది.అప్పట్లో గ్రీకు ప్రజలు తమ ఆరాధ్య దైవంకు దాల్చిన చెక్కను కానుకగా ఇవ్వడం ద్వారా తమ కోర్కెలను తీర్చమని అడిగేవారు.
దాల్చిన చెక్క ఇష్టదైవం అయిన గ్రీకు దేవుడు వారి కోర్కెలను తీర్చేవాడట.
ఇంతటి అద్బుతమైన ఘన చరిత్ర మరియు ఔషద గుణాలున్న దాల్చిన చెక్క అన్నంలో వస్తే తీసి పక్కకు పెట్టకండి.