ఇదేం తిట్ల రాజకీయం ? అందరూ ఇంతేనా

రాజకీయాలు అనేవి హుందాగా ఉండాలి.ఒక పార్టీని మరో పార్టీ విమర్శించినా నాయకుల పనితీరును ప్రశ్నించినా అంతిమంగా అది ప్రజల సంక్షేమం కోసమే అయి ఉండాలి.

 Thisis The Politicsof Andhrapradesh-TeluguStop.com

అయితే ప్రస్తుత రాజకీయాల్లో అవి మచ్చుకు కూడా కనిపించడం లేదు.ఇప్పటి రాజకీయాల్లో విలువలు ఆశించడం అంటే ఇసుక నుంచి నూనె తీయడమే.

Telugu Ap, Jansena Tdp Ycp, Days, Andhrapradesh-

హుందాగా రాజకీయాలు నడిపించడం ఈ మధ్యకాలంలో ఏ పార్టీలోనూ కనిపించడం లేదు.నాయకులు ఒకరిని ఒకరు తిట్టుకుంటూ, ఎవరు ఎక్కువగా పెడితే ఎవరు ఎన్ని బూతులు మాట్లాడితే అంత పాపులారిటీ వస్తుంది అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.రాజకీయాల్లో ఇప్పటి ట్రెండ్ అంతా బూతు మాటలే అన్నట్టుగా తయారయ్యాయి.ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన నాయకులంతా అదుపుతప్పి మాట్లాడుతున్నారు.

Telugu Ap, Jansena Tdp Ycp, Days, Andhrapradesh-

ప్రజాసంక్షేమం అనే మాటనే మరిచిపోయి మరి అధికార పక్షం విపక్షం అన్న తేడా లేకుండా తిట్లదండకం మొదలు పెడుతున్నారు.ప్రస్తుతం ఇవి హద్దులు మీరు పోయాయి.ఇటీవల కాలంలో రాజకీయ పార్టీల మధ్య వైరం బాగా పెరిగిపోయింది.ఒకరిని చూసి ఒకరు ఓర్చుకునే స్థితిలో లేరు.అందుకే ఒకరిమీద ఒకరు తిట్ల దండకం మొదలు పెడుతున్నారు.మీడియా ముందు వెనుక నాయకులు తమ ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తున్నారు.

రాజకీయంలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ తమకు మామూలే అన్నట్టు గా నాయకులు ప్రవర్తిస్తున్నారు.అసలు ప్రజల ముందు ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో తెలుసుకోకుండా తిట్ల దండకం మొదలు పెడుతున్నారు.

Telugu Ap, Jansena Tdp Ycp, Days, Andhrapradesh-

పదవిలో ఉన్నా పదవిలో లేకపోయినా, జనం మధ్య ఉన్న లేకపోయినా తిట్లతో కూడిన విమర్శలు ఇప్పుడు నాయకులకు సర్వ సాధారణం అయిపోయాయి.దీనిపై వారిని ప్రశ్నిస్తే మరింతగా రెచ్చిపోయి తిడతామని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.గతంలో వలే ప్రశాంత రాజకీయాలు, ప్రజా సంక్షేమం పై దృష్టి పెట్టాలన్న ఆలోచన కనిపించడం లేదు .ఒకరిమీద ఒకరు ఎప్పటికప్పుడు ఆధిపత్యం చెలాయిస్తూ తమ పదవులను కాపాడుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.నాయకులు తిట్ల పురాణం, అవకాశవాద రాజకీయాలను చూసి జనం ఇవేం రాజకీయాలు రా బాబు అనే పరిస్థితికి వచ్చేసారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube