రీల్స్‌ చూస్తూ వైద్యుడు నిర్లక్ష్యం.. మహిళ మృతి

ఉత్తరప్రదేశ్‌లోని( Uttar Pradesh ) మైన్‌పురిలో ఓ వైద్యుడి నిర్లక్ష్యం( Doctor Negligence ) కారణంగా మహిళ మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది.గుండె పోటుతో( Heart Attack ) బాధపడుతున్న మహిళను ఆసుపత్రికి తీసుకువెళ్లినా, వైద్యులు సరైన సమయంలో వైద్యం అందించకపోవడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది.

 Mainpuri Woman Dies Of Heart Attack As Doctor Watches Reels Video Viral Details,-TeluguStop.com

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మైన్‌పురి జిల్లాకు చెందిన ప్రవేశ్ కుమారి (60) అనే మహిళకు మంగళవారం ఛాతీలో నొప్పి రావడంతో ఆమె కుటుంబసభ్యులు సమీపంలోని మహారాజా తేజ్‌సింగ్‌ జిల్లా ఆసుపత్రికి తరలించారు.అయితే, అప్పటికే డ్యూటీలో ఉన్న డాక్టర్‌ ఆదర్శ్‌ సెంగార్‌ బాధితురాలి వద్దకు నర్సులను పంపించి, తాను మాత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌( Reels ) చూస్తూ నిర్లక్ష్యం వహించాడు.

కుటుంబసభ్యులు వైద్యం చేయాలని పలు మార్లు వేడుకున్నా పట్టించుకోలేదు.

దీంతో, ఐదు నిమిషాల పాటు తీవ్ర బాధతో విలవిలలాడిన ప్రవేశ్ కుమారి, సరైన వైద్య సహాయం అందక ప్రాణాలు కోల్పోయింది.ఈ ఘటనతో మృతురాలి కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ డాక్టర్‌పై దాడి చేశారు.దీంతో ఆస్పత్రి సిబ్బంది, కుటుంబసభ్యుల మధ్య వివాదం చోటుచేసుకుంది.మృతురాలి కుమారుడు గురుశరణ్ మాట్లాడుతూ.“మా తల్లి ప్రాణాలు పోయేవరకు డాక్టర్‌ రీల్స్‌ చూస్తూ కూర్చొన్నాడు.వైద్యం చేయమని అడిగినందుకు మాపైనే దాడి చేశాడు” అని వాపోయాడు.

ఈ ఘటనపై స్పందించిన పోలీసులు డాక్టర్‌ ఆదర్శ్‌ సెంగార్‌పై కేసు నమోదు చేశారు.చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ (సీఎంఎస్) ఆధ్వర్యంలో ఆసుపత్రిలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు.ఆరోపణలు నిజమని తేలినట్లయితే, సంబంధిత వైద్యుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.వీడియో చూసిన నెటిజన్స్ డాక్టర్ పై మండి పడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube