హ్యాట్రిక్ విజయాన్ని సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని అనుకున్న టీమిండియాకు( Team India ) రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో టీ20లో పరాజయం ఎదురైంది.ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్( England ) జట్టు 27 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఇంగ్లాండ్ నిర్ణయించిన 172 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా కేవలం 145 పరుగులకే ఆలౌట్ అయింది.ఈ పరాజయానికి ప్రధాన కారణంగా ఇంగ్లండ్ స్పిన్నర్ అదిల్ రషీద్ అద్భుత ప్రదర్శన చేశాడని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్( Suryakumar Yadav ) పేర్కొన్నాడు.
అదిల్ రషీద్( Adil Rashid ) తన 4 ఓవర్ల బౌలింగ్‌లో కేవలం 15 పరుగులే ఇచ్చి కీలక వికెట్లను తీశాడు.వీటిలో ముఖ్యంగా కీలక బ్యాటర్ తిలక్ వర్మ (18)ను క్లీన్‌బౌల్డ్ చేసి మ్యాచ్‌ను ఇంగ్లండ్ వైపుకు తిప్పేశాడు.
ఇక మ్యాచ్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.మ్యాచ్‌లో మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని ముందుగా భావించానని.కానీ చివరలో హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్ క్రీజులో ఉన్నప్పుడు మ్యాచ్ మేము గెలుస్తామనుకున్నటు తెలియపడు.కానీ, అదిల్ రషీద్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు.మమ్మల్ని స్ట్రైక్ రొటేట్ చేయనీయకుండా అద్భుతమైన లైన్, లెంగ్త్‌తో బౌలింగ్ చేశాడు.అందుకే అదిల్ రషీద్ ప్రపంచ అత్యుత్తమ స్పిన్నర్‌గా మారాడని సూర్యకుమార్ యాదవ్ వెల్లడించాడు.
అలాగే ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్( Jos Buttler ) మాట్లాడుతూ., “మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు.కేవలం వేగంతోనే కాకుండా, టెక్నికల్‌గా మెరుగైన బంతులు వేసి భారత్‌ను కష్టాల్లో నెట్టారని, రషీద్ మా జట్టులో ఉండటం మా అదృష్టమని తెలిపాడు.రషీద్ వైవిధ్యమైన బౌలింగ్ మ్యాచ్‌ను మేము గెలిచేలా చేసిందని తెలిపాడు.
అంతేకాకుండా చివర్లో రషీద్, మార్క్ వుడ్ కలిసి విలువైన పరుగులు సాధించడం కూడా ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించింది.భారత్ బ్యాటింగ్‌లో అసమతుల్యత కారణంగా ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైందని చెప్పవచ్చు.