ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) ఇటీవల పుష్ప 2( Pushpa 2 ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది.
ఇక ఈ సినిమా ఇంత మంచి సక్సెస్ కావడంతో బన్నీ తదుపరి సినిమాపై ఫోకస్ పెట్టారని తెలుస్తుంది.ఈయన ఇప్పటికే త్రివిక్రమ్( Trivikram ) డైరెక్షన్ లో సినిమాకు కమిట్ అయిన విషయం మనకు తెలిసిందే.
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

సుమారు 400 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక బిగ్ అప్డేట్ మెగా ప్రొడ్యూసర్ బన్నీ వాసు( Bunny Vasu ) వెల్లడించారు.ప్రస్తుతం బన్నీ వాసు తండేల్( Thandel )సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు.
గీత ఆర్ట్స్ బ్యానర్ లో డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7వ తేదీ విడుదల కాబోతోంది.

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా బన్నీ వాసు వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా గురించి మాట్లాడారు.అల్లు అర్జున్ ప్రాజెక్ట్స్ డిస్కషన్స్ లో తాను కీలకంగా వ్యవహరిస్తానని తెలిపారు.
అయితే ఇలాంటి కథలను ఎంపిక చేసుకోవాలి ఎవరితో సినిమా చేయాలి అనే విషయాలు మాత్రం అల్లు అర్జున్ నిర్ణయించుకుంటారని తెలిపారు.ఇక అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా అఫీషియల్ గానే మేము తెలియజేస్తాము.
అధికారికంగా ప్రకటన రాకముందే ఈ సినిమా గురించి నేనేమీ మాట్లాడనని మార్చి నెలలో ఈ సినిమాని ప్రకటించాలని ప్లాన్ చేస్తున్నాం.సినిమా వివరాలు తెలియజేయడానికి ఒక స్పోక్స్ పర్సన్ ని హైర్ చేస్తున్నాం.
ఊహాగానాలకు తావులేకుండా వారి ద్వారానే అన్ని విషయాలను ప్రాపర్ గా వెల్లడించాలని అనుకుంటున్నాం అంటూ బన్నీ వాసు తెలిపారు.