భారతీయుల్లో అత్యధిక మంది రైస్‌ను ప్రధాన ఆహారంగా తీసుకుంటారు.తక్కువ ధరకే బియ్యం లభించడం, ఏ కూరతోనైనా కలుపుకుని తినగలిగే సౌలభ్యం ఉండడంతో చాలా మంది మూడు పూటలు రైస్‌నే ఆహారంగా తీసుకుంటారు.
అయితే చెమటలు పట్టేలా పని చేసేవారు మూడు పూటలు రైస్ తీసుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవు.
కానీ, ఒకే చోటు కూర్చుని.
శారీరక శ్రమ లేకుండా పనిచేసే వారు అతిగా రైస్ తీసుకుంటే అనేక సమస్యలు తలెత్తుతాయి.అందుకే అన్నం తినడం కూడా సమయానికి తగ్గట్లుగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
సాధారణంగా పగటి పూట జీవక్రియలు మంచిగా ఉంటాయి.ఈ టైమ్‌లో అన్నం తింటే త్వరగా జీర్ణం అయిపోతుంది.
అదే రాత్రి సమయంలో అయితే అన్నం తీసుకోకపోవడమే మంచిదని అంటున్నారు.

రైస్‌లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి.వీటి వల్ల అధిక బరువుతో పాటు కొవ్వు శాతం కూడా పెరిగి గుండె సమస్యలు తలెత్తుతాయి.అలాగే రాత్రిపూట అన్నం తీసుకోవడం షుగర్ లెవెల్స్ కూడా పెరిగే అవకాశాలు ఎక్కువ.
అందుకే రాత్రిపూట అన్నం బదులు చపాతీ తీసుకోవడం మంచిదంటున్నారు.
రాత్రిపూట అన్నానికి బదులు చపాతీలు తినడం వల్ల బరువు తగ్గడంతో పాటు.
రక్తి హీనత సమస్యను కూడా అధిగమించవచ్చు.ఎందుకంటే.
చపాతీలు చేసే గోధుమ పిండిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.ఇది రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది.
అలాగే రాత్రిపూట చపాతీలు తీసుకుంటే గుండె జడ్డులు, మధుమేహ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.