ఇటీవల ఒక బుల్లితెర కార్యక్రమంలో భాగంగా సుడిగాలి సుదీర్(Sudheer) చేసినటువంటి స్కిట్ పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే.ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి (Chiranjeevi)హీరోగా నటించిన బావగారు బాగున్నారా సినిమాలో నంది (Nandi)కొమ్ములలో నుంచి చూస్తే హీరోయిన్ రంభ(Rambha) కనిపించే సీన్ ఇక్కడ రీ క్రియేట్ చేశారు.
ఇక ఈ కార్యక్రమానికి ఆరోజు రంభ రావడంతో ఈ స్కిట్ రీ క్రియేట్ చేశారు అయితే ఇది కాస్త సంచలనంగా మారింది.నందీశ్వరుడి కొమ్మలలో నుంచి చూస్తే పరమశివుడు కనిపించాలి కాని ఇలా హీరోయిన్లు కనిపించడాన్ని హిందూ సంఘాలు వానరసేన పూర్తిస్థాయిలో తప్పు పట్టారు.

ఈ క్రమంలోనే హిందూ దేవుళ్లను కించపరుస్తూ చేసినటువంటి ఈ స్కిట్ పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు అయితే ఈ కార్యక్రమానికి యాంకర్ గా రవి (Ravi)వ్యవహరించారు.రవి కూడా క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు.అయితే ఈ వివాదంపై యాంకర్ రవి స్పందిస్తూ ఒక వీడియోని విడుదల చేశారు.ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ ఈ స్కిట్ ఎలా జరిగిందో ఇదివరకే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాను కానీ కొంతమంది వీడు మారిపోయాడు అది ఇది అంటూ మాట్లాడుతున్నారు.

నేను కూడా పక్కా హిందువునే హనుమాన్ చాలీసా చదువుతాను, ప్రతిరోజు ఓం నమశ్శివాయ అనే నామాన్ని కూడా చదువుతాను.ఈ స్కిట్ ఎలాంటి పరిస్థితులలో చేసామో అందరికీ అర్థమయ్యేలా వివరించాను కానీ కొంతమంది మాత్రం తమ వ్యూస్ కోసం పిచ్చిపిచ్చి తంబ్ నెయిల్స్ పెడుతున్నారు.ఇలాంటి వాటిని నమ్మకండి మరోసారి ఈ విధమైనటువంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాము అంటూ రవి ఈ ఘటనపై స్పందిస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.మరి ఈ వీడియోలపై వానరసేన హిందూ సంఘాలు ఎలా స్పందిస్తాయో తెలియాల్సి ఉంది.