పురాణాల ప్రకారం దేవతలకు ఉత్తరాయణ కాలం అంటే పగలు, దక్షిణాయ కాలం అంటే రాత్రి సమయం అని అంటారు.అయితే ఈ ఉత్తరాయణ సమయంలో దేవతలు మేలుకొని ఉంటారు.
కాబట్టి ఉత్తరాయణము శారీరక శ్రమకు, పూజలకు, సాధనకు అనుకూలమైన కాలమని, అలాగే దక్షిణాయము ధ్యానానికి, దీక్షలకు, పితృదేవతార్చనలకు అనుకూలమైన కాలమని శాస్త్రములో చెప్పడం జరిగింది.అందుకే ఇంతటి ప్రాధాన్యత ఉంది.
అయితే సంక్రాంతిలో( Sankranti ) సం అంటే మిక్కిలి అని కాంతి అంటే అభ్యుదయము అని అర్థం.కొత్త అభ్యుదయమును ఇచ్చిన క్రాంతిని సంక్రాంతి అని చెబుతారు.

అయితే సూర్యుడు( Sun ) అన్ని రాశులను దాటుకుంటూ మకర రాశిలోకి ప్రవేశించడం వలన దీనిని మకర సంక్రాంతి( Makara Sankranti ) అని అంటారు.మకర సంక్రాంతి రోజున ప్రతి వ్యక్తి కూడా తల స్నానం చేయాలి.అలాగే ఇంట్లో పూజలు ఆచరించాలి.అంతేకాకుండా పితృదేవతలకు, తర్పణాలు వదలాలి.అయితే మురికి లేని వస్త్రాలు, నూతన వస్త్రాలు ధరించాలి.ఇక మకర సంక్రాంతి రోజున సూర్య ఆరాధన, విష్ణుమూర్తి పూజలు ఆచరించాలి.
ఈరోజున సత్యనారాయణ స్వామి వ్రతం( Satya Narayana Swamy Vrat ) చేసుకోవడం వలన చాలా విశేషం.ఇక ఈ సంక్రాంతి రోజు దానధర్మాలు చేయడం వలన కలిగేటువంటి ఫలము కొన్ని కోట్ల రెట్లు ఉంటుంది.

అలాగే ఈ వ్రతం ఉండడం వలన ఎన్నో ఫలితాలను కలిగిస్తాయని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి.ఇక సంక్రాంతి రోజున నవధాన్యాలు, పండ్లు, కూరగాయలు, వస్త్రములు లాంటివి దానము చేయడం వలన వారికి విశేషమైనటువంటి పుణ్యఫలము లభిస్తుందని పండితులు చెబుతున్నారు.ఇక కేవలం మకర సంక్రాంతి రోజు పితృదేవతలకు నువ్వులతో తర్పణాలు వదలడం వలన మిగిలిన అన్ని నెలల్లో అన్ని సమయాల్లో తర్పణాలు వదిలినంత ఫలితం లభిస్తుంది.ఇక మకర సంక్రాంతి రోజు సూర్యనారాయణుని పూజ, సత్యనారాయణ స్వామి వ్రతం లాంటిది చేయడం వలన చాలా ఫలితాలు లభిస్తాయి.
DEVOTIONAL