తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకొచ్చిన కొత్త యాప్ కు అనూహ్య స్పందన వచ్చింది.ఈ నెల 27న TTDevasthanam యాప్ ను టీటీడీ ఆవిష్కరించింది.
ఈ యాప్ ద్వారా తిరుమల కు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉండనుంది.తిరుమల కు సంబంధించి శ్రీవారి దర్శనం టికెట్లు, సేవలు వసతి గృహాలను ఈ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.
అంతేకాకుండా తిరుమల కు సంబంధించి సమాచారం అంతా భక్తులకు అందుబాటులో ఉంటుంది.తిరుమల శ్రీవారికి విరాళాలు కూడా అందజేయవచ్చు.
ఇప్పటివరకు ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉన్న సమాచారం ఇప్పటినుంచి భక్తుల చేతుల్లోనే సిద్ధంగా ఉంటుంది.కొన్ని సంవత్సరాల నుంచి నిర్వహించిన గోవిందా యాప్ పైన పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ఆస్థానంలో కొత్త యాప్ తీసుకొచ్చారు.

ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ సమాచారం అందించే విధంగా ఈ యాప్ ను తీసుకొచ్చారు.27వ తేదీన ప్రారంభించిన ఈ యాప్ ను ఒక్క రోజులోనే దాదాపుగా 10 లక్షల మందికి పైగా భక్తులు డౌన్లోడ్ చేసుకున్నారు.ఈ యాప్ లో దర్శనం వివరాలు స్వామివారి కైంకర్యాల వివరాలు పొందపరిచారు.ఇప్పటివరకు ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి నిర్దేశించిన సమయం ప్రకారం కొండపైన వసతి గదులు, శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు.

శ్రీవారి సేవలు జరిగే సమయంలోనే సుప్రభాతం, తోమల అర్చన వంటి వాటిని ఎందుకు వీలుగా ఏర్పాటు చేస్తున్నారు.ఈ యాప్ లో ఎస్వీబీసీ కార్యక్రమాలను వీక్షించే అవకాశం కల్పించారు.ఇప్పటివరకు ఆన్లైన్లో స్వామివారి దర్శనం, వసతి గృహాలు బుక్ చేసుకోవడానికి వెబ్సైట్ మాత్రమే అందుబాటులో ఉంది.సహజంగా తిరుమల టికెట్ల బుకింగ్లకు ప్రతి రోజు రద్దీ ఉంటుంది.
ఆన్లైన్లో సంకేతిక సమస్యలతో టికెట్లు దక్కించుకోవడం ఇబ్బందిగా మారుతుంది.దీంతో యాప్ ద్వారా సులభంతరంగా దర్శనంతో పాటు వసతి టికెట్లను కూడా పొందే అవకాశాన్ని కల్పించింది.