కొంతమంది సెలబ్రెటీలకు ఏవైనా చిన్న విషయాలైనా తెలియకపోతే వెంటనే నెటిజన్స్ బాగా ట్రోల్స్ చేస్తూ ఉంటారు.నిజానికి సెలబ్రెటీలు తెలిసి తెలియక ఏవైనా పొరపాట్లు చేస్తే చాలు ఓ రేంజ్ లో ఆడుకుంటారు.
ఇప్పుడు అషు రెడ్డి విషయంలో కూడా అదే జరిగింది.ఇంతకు అసలేమైందో తెలుసుకుందాం.
బుల్లితెర ఆర్టిస్ట్, సోషల్ మీడియా స్టార్ అషు రెడ్డి మొత్తానికి తన పరిచయాన్ని పూర్తిగా పెంచేసుకుంది.
తన అందంతో కుర్రాళ్ళ మదిలో గుడి కట్టేసుకుంది.
ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది.ప్రస్తుతం బుల్లితెర పై ఓ రేంజ్ లో దూసుకెళుతోంది.
పైగా వెండితెరపై కూడా బాగా బిజీ గా మారింది.కెరీర్ మొదట్లో డబ్ స్మాష్ వీడియోలు చేస్తూ నెటిజన్ల దృష్టి లో పడిన ఈ ముద్దుగుమ్మ అచ్చం సమంత లాగా కనిపించడంతో జూనియర్ సమంత గా పేరు సంపాదించుకుంది.

అలా వెండితెరపై నితిన్ నటించిన సినిమాలో సైడ్ క్యారెక్టర్ గా అవకాశం అందుకుంది.ఆ తర్వాత రియాలిటీ షో బిగ్ బాస్ లో పాల్గొని తన పరిచయాన్ని పెంచుకుంది.అందులో తను చేసిన అల్లరి అంతా ఇంతా కాదు.బిగ్ బాస్ షో తర్వాత టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో బాగా ఎంజాయ్ చేసింది.అతడితో కలిసి పార్టీలు, పబ్ లు తిరుగుతూ అతడితో డేటింగ్ చేస్తున్నట్లు అందరి దృష్టిలో పడిపోయింది.
కానీ ఆ తర్వాత ఆ మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని చాలాసార్లు చెప్పుకున్నారు.
అలా కొంత కాలం తర్వాత బుల్లితెరపై ప్రసారమైన కామెడీ స్టార్స్ అనే కామెడీ షో లో లేడీ కమెడియన్ గా చేసింది.అందులో మరో ఆర్టిస్ట్ హరి తో కలిసి బాగా రచ్చ చేసింది.
ఏకంగా అతడికి ముద్దులు పెట్టి, హగ్ లు ఇచ్చి అందరినీ షాక్ అయ్యేలా చేసింది.దీంతో హరి తో కూడా ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

కానీ అదంతా పుకారే అని కేవలం షో కోసం అలా చేశామని గతంలో చెప్పుకున్నారు.ఇక ఈమె కు పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానం గురించి మాటల్లో చెప్పలేము.ఏకంగా ఆయన పేరును టాటూ వేయించుకుని మరీ తన అభిమానమేంటో నిరూపించింది.సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలు బాగా షేర్ చేసుకుంటుంది.
అప్పుడప్పుడు ఫన్నీ వీడియోలు కూడా పంచుకుంటుంది.
ఖాళీ సమయం దొరికితే బాగా ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.
ఇదంతా పక్కన పెడితే తాజాగా తను తన ప్రాజెక్టు సందర్భంగా పులివెందులో ఉండగా అక్కడ చేసిన పనులను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంది.అయితే తాజాగా తను దూడ దగ్గర ఉండి గుడ్ బాయ్.
బేబీ కౌ అంటూ క్యాప్షన్ పెట్టి దాని దగ్గర సరదాగా ఆడుకుంటున్న వీడియో పంచుకుంది.ప్రస్తుతం ఆ వీడియో చూసిన నెటిజన్స్ అది ఆవు కాదమ్మా గేదె అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.
జాగ్రత్త ఒక తన్ను తంతే దాని మమ్మీ దగ్గరికి పోతావంటూ కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది.







