హెయిర్ ఫాల్ సమస్యకు దూరంగా ఉండాలి అంటే జుట్టు కుదుళ్లు స్ట్రోంగ్‌గా ఉండాలి.కానీ పోషకాల కొరత, కాలుష్యం, ఒత్తిడి, కెమికల్స్ అధికంగా ఉండే ఉత్పత్తులను వినియోగించడం, రోజూ తలస్నానం చేయడం తదితర కారణాల వల్ల కుదుళ్లు బలహీనపడతాయి.
దాంతో జుట్టు రాలడం అధికమవుతుంది.ఈ క్రమంలోనే హెయిర్ ఫాల్ ను కంట్రోల్ చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా? అయితే ఇకపై చింతించకండి.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే హోం మేడ్ హెయిర్ మాస్క్ ను వారంలో ఒక్కసారి ట్రై చేస్తే మీ జుట్టు కుదుళ్లు దృఢంగా, బలంగా మారతాయి.
దాంతో హెయిర్ ఫాల్ క్రమంగా అదుపులోకి వచ్చేస్తుంది.మరి ఇంతకీ ఆ హెయిర్ మాస్క్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల బియ్యం వేసి ఒకసారి వాటర్ తో వాష్ చేయాలి.ఆ తర్వాత ఒకటిన్నర గ్లాస్ నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి.
మరుసటి రోజు నానబెట్టుకున్న బియ్యం నుంచి వాటర్ ను మాత్రం సపరేట్ చేసి పెట్టుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో రైస్ వాటర్ ను పోయాలి.
అలాగే అందులో రెండు టేబుల్ స్పూన్ల అవిసె గింజలు, రెండు రెబ్బలు కరివేపాకు వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి.

ఉడికించుకున్న మిశ్రమం పూర్తిగా చల్లారిన తరువాత పల్చటి వస్త్రంలో వేసి జెల్లి స్ట్రక్చర్ లో ఉండే మిశ్రమాన్ని వేరు చేయాలి.ఇలా వేరు చేసిన మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ ను మిక్స్ చేసి జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకోవాలి.అనంతరం మైల్డ్ షాంపూ ని యూస్ చేసి గోరు వెచ్చని నీటితో శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.
వారంలో ఒక్కసారి ఈ హెయిర్ మాస్క్ ను వేసుకుంటే జుట్టు కుదుళ్లు దృఢంగా తయారవుతాయి.దాంతో హెయిర్ ఫాల్ సమస్య క్రమంగా దూరమవుతుంది.