సాయి దత్త పీఠం కల్పతరువులో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు..

అమెరికాలో హిందూ ఆధ్యాత్మిక ప్రవాహాన్ని కొనసాగిస్తున్న న్యూ జెర్సీ సాయి దత్త పీఠంలో ఈ నెల 18, 19వ తేదీలలో అంగరంగ వైభవంగా మహాశివరాత్రి పర్వదిన వేడుకలు నిర్వహించారు. శివ, విష్ణు దేవాలయం ఒక కొలువై ఉన్న పంచాముఖ పరమేశ్వరుని, అమరేశ్వర స్వామిని వేలాదిగా భక్తులు దర్శించుకున్నారు.

 Mahashivratri Celebrations At Sai Datta Peetha Kalpataru ,sai Datta Peetha Kalpa-TeluguStop.com

ఈ రెండు రోజులు జరిగిన ప్రధమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ కాల అభిషేకాలలో బిల్వ అష్టోత్తర, శతనామార్చన 11 సార్లు రుద్ర పారాయణ సహస్రనామార్చన, లలిత రుద్ర త్రిశతి నామార్చన, నందీశ్వర పూజ, హారతి మంత్రపుష్ప పూజలలో పాల్గొన్నారు.

Telugu Bakti, Devotional, Mahashivratri, Jerseysai, Saidatta, Shivavishnu-Latest

సాయంత్రం సమయంలో శ్రీ శివపార్వతుల కళ్యాణాలలో న్యూ జెర్సీ, న్యూయార్క్, ఫిలడెల్ఫియా రాష్ట్రాల పరిసర ప్రాంతాల నుంచి విశేషంగా భక్తులు పాల్గొన్నారు.దాదాపు 6000 మందికి పైగా భక్తులు ఈ శివరాత్రి వేడుకలలో పాల్గొన్నారు.వచ్చిన భక్తులందరికీ అన్నదాన టీం మహా ప్రసాదాన్ని అందించారు.

దేవాలయంలో ప్రతిష్టాత్మక కల్పతరువు ఆకృతి నిర్మాణం భక్తుల సందర్శనార్థం దిగ్విజయంగా ఏర్పాటు చేశారు.

Telugu Bakti, Devotional, Mahashivratri, Jerseysai, Saidatta, Shivavishnu-Latest

ఎడిషన్ లో సాయి దత్త పీఠం నిర్మించిన శ్రీ శివ విష్ణు దేవాలయ అభివృద్ధి కోసం చేపట్టిన ఈ కల్పతరువు కార్యక్రమానికి చక్కటి స్పందన వచ్చింది.కల్పతరువు కార్యక్రమం విరాళాలు ఇచ్చిన వారికి పేర్లను లోహపు రేకులపై ఆకుల రూపంలో చెక్కి ఆకులతో కల్ప వృక్ష ఆకృతిని రూపొందించారు.ఈ ఆకృతిని దేవాలయ గోడపై ప్రతిష్టించారు.

ఇలా దేవా దేవుడికి విరాళాలు ఇచ్చిన వారి వివరాలు చిరకాలం నిలిచిపోయేలా ఉంటాయని, ఈరోజు వరకు పాల్గొన్న దాతల వివరాలు లోహపు రేకులపై ఏర్పాటు చేయబడ్డాయని వెల్లడించారు.ఇంకా పాల్గొనని భక్తులకు ఇది ఒక సువర్ణ అవకాశమని వెల్లడించారు.

కల్ప తరువు వృక్షానికి పూజలు చేసి భక్తులు సాయి దత్త పీఠంపై చూపిస్తున్న ఆదరణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube