మకర సంక్రాంతి రోజు మాంసాహారం తినవచ్చా..

సాధారణంగా మన దేశవ్యాప్తంగా చాలా మంది ప్రజలు సంక్రాంతి పండుగను వారి కుటుంబ సభ్యులందరితో పాటు కలిసి ఎంతో ఘనంగా జరుపుకుంటారు.మకర సంక్రాంతి రోజు ఉదయం దాదాపు ప్రతి ఒక్కరూ స్నానం చేసి ఆ తర్వాత కచ్చితంగా ఆహారం తింటూ ఉంటారు.

 Can We Eat Meat On Makar Sankranti , Sankranti , Devotional, Festival, Meat, Al-TeluguStop.com

తల స్నానం చేయకుండా పండుగ రోజు ఎవరు కూడా ఆహారాన్ని తీసుకోరు.మకర సంక్రాంతి పర్వ దినాన మిగిలిపోయిన ఆహారాన్ని అస్సలు తీసుకోకూడదు.

అలా తీసుకుంటే ప్రతికూల శక్తులు అధిపత్యం చెలాయిస్తాయి అని చెబుతూ ఉంటారు.ఇంకా చెప్పాలంటే కోపం కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.

మకర సంక్రాంతి పర్వదినం రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారాన్ని తినకూడదు.మాంసం, మద్యం, వెల్లుల్లి, ఉల్లిపాయలను తమ ఆహారంలో తీసుకోకుండా ఉంటేనే ఎంతో మంచిది.ఆకుకూరలు, శాఖాహారం తీసుకుంటే మంచిది.సంక్రాంతి రోజున చెట్లకు నీరు పోయడం చేయవచ్చు.చెట్లను నరకకూడదు.ప్రకృతికి హాని కలిగించకూడదు.

ఇంకా చెప్పాలంటే అనవసరంగా ఎవరితోనూ గొడవకు దిగడం గాని ఎవరినైనా రెచ్చగొట్టడం కానీ అస్సలు చేయకూడదు.పేదలకు దానం చేయాలని వేద పండితులు చెబుతున్నారు.

ఈ సమయంలో ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటిస్తూ ఉండాలి.

మకర సంక్రాంతి రోజు న పవిత్ర నదులలో స్నానం చేయడం వల్ల పాపాల నుంచి విముక్తి, మోక్షం కలుగుతుందని చెబుతున్నారు.గంగా స్నానం చేయడం ఉత్తమం అని వేద పండితులు చెబుతున్నారు.మకర సంక్రాంతి రోజున ప్రతి ఒక్కరూ తమ పూర్వీకుల పేరిట తర్పణం చేయాలని పండితులు చెబుతున్నారు.

ఈ కారణంగా ఇంట్లో పితృ దోషం దూరమైపోతుంది.ఈ రోజున మహారాజ భగీరథుడు తన పూర్వీకుల ఆత్మలకు శాంతి కోసం గంగా నది లో తర్పణం చేశారని పురాణాలలో ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube