రక్షణ పెంచిన టిటిడి

తిరుపతి( Tirupati ) మెట్ల మార్గంలో జరిగిన హృదయ విధాకర సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసింది.నాలుగేళ్ల పాప లక్షిత( Lakshitha ) ను చిరుత దాడి చేసి పొట్టన పెట్టుకున్న వైనంపై రాష్ట్ర మొత్తం కన్నీరు పెట్టింది.

 Protection Enhanced  By Ttd, Ttd , Protection  , Devotees , Leopard Attack , Lak-TeluguStop.com

ఆ పాప తల్లిదండ్రుల రోదనలతో రాష్ట్ర వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి .దీనితో తిరుపతి నడక మార్గంలోని భక్తుల భద్రత ప్రశ్నార్థకం కావడం.

Telugu Devotees, Lakshitha, Leopard Attack-Latest News - Telugu

టీటీడీ పర్యవేక్షణ పై అనేక విమర్శలు వినిపించడంతో టీటీడీ దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు సమాచారం.ముఖ్యంగా నడక మార్గంలో సమయాలను కుదించడంతోపాటు నడక మార్గంలో భద్రతను రెట్టింపు చేసినట్లుగా తెలుస్తుంది.అంతేకాకుండా 15 సంవత్సరాల లోపు పిల్లలకు చేతికి పోలీసులు టాగులు వేస్తున్నారు.వీటిని దర్శనం వరకు వెళ్లే లోపు రెండుసార్లుగా పరిశీలిస్తారు.ఏడో నెంబర్ మైలురాయి వద్ద ఒకసారి గాలిగోపురం వద్ద ఒకసారి పోలీస్ సిబ్బంది పరిశీలిస్తారని టిటిడి తెలిపింది.

Telugu Devotees, Lakshitha, Leopard Attack-Latest News - Telugu

ముఖ్యంగా దీనిపై పిల్లల వివరాలు తల్లిదండ్రుల పేర్లు ఫోన్ నెంబర్లు ఉంటాయి.దీంతో ఎవరైనా పిల్లలు తప్పిపోయినా గుర్తించడం సులభం అవుతుందని టిటిడి తెలియజేసింది.ఇటీవల జరుగుతున్న వరుస సంఘటనలు తిరుపతి వెళుతున్న భక్తుల( Devotees ) భద్రతను ప్రశ్నార్థకం చేయడంతో టిటిడి ఈ చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది.

అంతేకాకుండా ఇప్పటివరకు ఒక చిరుతపులిని బంధించిన అటవీ శాఖ అధికారులు మరో మూడు చిరుతలు ఆ మార్గం గుండా ప్రయాణిస్తున్నట్లుగా గుర్తించారు.దాంతో వాటిని కూడా పట్టుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు .ఇప్పటికే వందకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నాలుగు బోన్లను మోహరించారు .వచ్చే కొద్ది రోజుల్లో మరిన్ని రక్షణ ఏర్పాట్లు చేసి మ్యాన్ ఈటర్స్ గా మారిన చిరుతలను పట్టుకుంటామంటూ అటవీ శాఖ తెలిపింది ఏది ఏమైనా జరుగుతున్న వరుస సంఘటనలతో తిరుపతి దర్శనానికి వెళుతున్న భక్తులు ప్రాణాల అరిచేతుల్లో పెట్టుకుని వెళ్తున్నట్టుగా తెలుస్తుంది

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube