వాస్తు శాస్త్రం( Vastu shastra )లో పరిగెడుతున్న ఏడు తెల్ల గుర్రాల చిత్రం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.ఈ చిత్రాన్ని చాలా అదృష్టంగా కూడా భావిస్తారు.
వాస్తు ప్రకారం ఇంట్లో లేదా కార్యాలయంలో ఏడు గుర్రాలు పరిగెత్తుతూ ఉండే చిత్రాన్ని లేదా పెయింటింగ్ ను ఉంచడం వలన చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది.అయితే ఈ చిత్రం ఉద్యోగం లేదా వ్యాపారంలో పురోగతిని తీసుకురావడంలో సహాయపడుతుంది.
అంతేకాకుండా అదృష్టానికి, ఐశ్వర్యానికి కూడా చిహ్నంగా భావించాలి.కాబట్టి అవి ఉద్యోగం లేదా వ్యాపారంలో అభివృద్ధిని తీసుకువస్తాయి.
ఇవి ఆర్థిక పరిస్థితిను కూడా మెరుగుపరుస్తాయి.

పరిగెత్తే 7 గుర్రాలు విజయానికి చిహ్నంగా పరిగణించబడుతున్నాయి.ఏడు సంఖ్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.సంఖ్య ఏడు శుభం, అదృష్టంగా పరిగణించబడుతుంది.
ఇంద్రధనస్సులో ఏడు రంగులు ఉంటాయి.వివాహం సమయంలో సప్తపది( Saptapadi ) అంటే హోమం చుట్టూ ఏడుసార్లు తిరుగుతారు.
అంతేకాకుండా వివాహం కూడా ఏడు జన్మల బంధంగా చెప్పబడుతుంది.ఇక ఆకాశగంగలో ఏడు సప్త ఋషులు కూడా ఉన్నారు.
ఇక సూర్య భగవానుడి రథంలో కూడా ఏడు గుర్రాలు ఉంటాయి.న్యూమరాలజీ( Numerology )లో కూడా ఏడవ సంఖ్య జనన సంఖ్యగా ఉన్న పిల్లలను చాలా అదృష్టవంతులుగా పరిగణిస్తారు.</br

ఇక ఈ కారణంగా ఏడు తెల్లని పరిగెత్తే గుర్రాల పెయింటింగ్ చాలా అదృష్టంగా భావించబడుతుంది.ఈ పెయింటింగ్ సరైన దిశలో ఉంచినట్లయితే జీవితంలో ఆనందం, శ్రేయస్సు, విజయం లభిస్తుంది.అంతేకాకుండా ఇంటికి ఉత్తర దిశలో ఏడు తెల్లని పరిగెత్తే గుర్రాల పెయింటింగ్ ఉంచడం శుభప్రదంగా భావించాలి.ఇలా చేయడం వలన ఉద్యోగం లేదా వ్యాపారంలో పురోగతి, ఆర్థిక లాభం ఉంటుంది.
ఇక ఏడు గుర్రాల రథం పై సూర్యభగవానుడు ప్రయాణించే పెయింటింగ్ లేదా చిత్రం కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతోంది.ఈ పెయింటింగ్ ను ఇంటికి తూర్పు దిశలో ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది.
ఇక సమాజంలో పేరు తెచ్చుకోవాలన్న, కీర్తి గౌరవం కావాలన్నా కూడా దక్షిణ దిశలో పరిగెత్తే ఏడు గుర్రాల పెయింటింగ్ ఏర్పాటు చేసుకోవడం మంచిది.ఇక ఈ పెయింటింగ్ ను ఇంట్లోకి తీసుకురావడానికి ముందు కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి.
ఫోటోలోని గుర్రాలు తాడుతో కట్టినట్లు ఉండకూడదు.అలాగే ఆఫీసులో పరిగెత్తే గుర్రాల పెయింటింగ్ పెట్టుకోవాలంటే ఆ గుర్రాల చిత్రం ఆఫీసు లోపల ఎదురుగా ఉండాలి.
ఇక ఆఫీసులో ఈ పెయింటింగ్ దక్షిణ గోడ పై మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి.
DEVOTIONAL