ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.00
సూర్యాస్తమయం: సాయంత్రం.6.44
రాహుకాలం: మ.3.00 సా4.30
అమృత ఘడియలు: మ.12.30 ల2.30
దుర్ముహూర్తం: ఉ.8.24 ల9.12 రా.10.46 ల11.36
మేషం:
ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి.ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది.నూతన వాహన యోగం ఉన్నది దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.
సన్నిహితుల నుంచి వివాదాలపై కీలక సమాచారం అందుతుంది.ఉద్యోగ విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
వృషభం:
ఈరోజు ఇతరులతో వివాదాలకు వెళ్లకపోవడం మంచిది.కుటుంబ సభ్యులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి.ఆర్థిక పరిస్థితి మరింత నిరాశ కలిగిస్తుంది.చేపట్టిన పనులు శ్రమతో కొన్ని పూర్తవుతాయి.వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు.
మిథునం:
ఈరోజు చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు.వ్యాపార, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది.ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు.ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి.కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
కర్కాటకం:
ఈరోజు కుటుంబ సమస్యలు మరింత నిరాశ కలిగిస్తాయి.వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా సాగవు.ముఖ్యమైన పనులలో ప్రతిబంధకాలు తప్పవు.ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది.ఉద్యోగ, ప్రయత్నాలు మందగిస్తాయి.నూతన ప్రయత్నాలు అంతగా కలిసి రావు.
సింహం:
ఈరోజు కుటుంబ సభ్యులతో స్వల్ప మాటపట్టింపులు ఉంటాయి.వృధా ఖర్చులు పెరుగుతాయి.వ్యాపార వ్యవహారాలలో సొంత ఆలోచనలు చేయడం మంచిది కాదు.ఇంటాబయట బాధ్యతలు చికాకు పరుస్తాయి.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహకర వాతావరణం ఉంటుంది.
కన్య:
ఈరోజు కీలక నిర్ణయాలలో సన్నిహితుల సలహా తీసుకొని ముందుకు సాగడం మంచిది.చేపట్టిన పనుల్లో చికాకులు పెరుగుతాయి.సోదరుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు.ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి తగిన సహాయం లభిస్తుంది.వృత్తి, వ్యాపారాలలో సమస్యలు తెలివిగా పరిష్కరించుకుంటారు.
తుల:
ఈరోజు సన్నిహితులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానం అందుకుంటారు.వ్యాపార వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు.
ఇంటా బయట మరింత ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది.ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది.ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది.
వృశ్చికం:
ఈరోజు కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.ఆకస్మిక ప్రయాణాలు వస్తుంది ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమాధిక్యత కలుగుతుంది.ఆర్థిక పరిస్థితి కొంత మందకొడిగా సాగుతుంది.
ధన వ్యవహారాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహకర వాతావరణం ఉంటుంది.
ధనుస్సు:
ఈరోజు కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి.బంధువర్గంతో విభేదాలు.ముఖ్యమైన వ్యవహారాలలో సొంత ఆలోచనలు చెయ్యటం మంచిది కాదు.చేపట్టిన పనులలో తొందరపాటు మంచిది కాదు.వ్యాపార, ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరిగి విశ్రాంతి ఉండదు.
మకరం:
ఈరోజు నిరుద్యోగుల ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తాయి.సోదరుల నుండి అవసరానికి ధన సహాయం లభిస్తుంది.చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి.
నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.వ్యాపార, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.
కుంభం:
ఈరోజు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.చేపట్టిన పనులు జాప్యం అయినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు.దైవదర్శనాలు చేసుకుంటారు.
సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి.ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి.
మీనం:
ఈరోజు ఇంటాబయట పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రాహారాలు ఉండవు.ఆరోగ్య అభివృద్ధి చేయడం మంచిది కాదు.బంధువులతో ఊహించని విభేదాలు కలుగుతాయి.
ఆర్థిక పరిస్థితులు కొంత మందగిస్తాయి.వృత్తి, వ్యాపారాలు ఇబ్బంది కలిగిస్తాయి.
నిరుద్యోగులు అధిక శ్రమతో అల్ప ఫలితాలు పొందుతారు.
.