దేవరాజ్ .రౌద్రమైన రూపం.
గుంతల మొహం తో అచ్చంగా విలనిజాన్ని పుణికి పుచ్చుకున్న నటుడిగా తెలుగు ప్రేక్షకులకు బాగానే పరిచయం.అయితే ఇతడు తెలుగు నటుడు కాదు పుట్టింది కర్ణాటక.
బెంగుళూరు లోని రాజలింగాపురం అనే గ్రామంలో జన్మించగా తనకు కేవలం మూడు నెలల వయసు ఉన్నప్పుడే మలేరియా తో తండ్రిని కోల్పోయాడు.ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండటం తో హెచ్ ఏం టి లో 9 ఏళ్ళ పాటు ఉద్యోగం కూడా చేసాడు.
ఆ తర్వాత తనతో పని చేసిన ఒక వ్యక్తి సలహా మేరకు ఉద్యోగం మానేసి నాటకాల్లో నటించడం మొదలు పెట్టాడు.మొదట్లో కొన్ని నాటకాల్లో నటించిన ఆ తర్వాత వెండి తెరపై త్రిశూల్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు.
ఈ చిత్రం విధులకు నోచుకోలేదు.
ఆ తర్వాత 27 మావళ్ళిసర్కిల్ అనే సినిమా మొదట దేవరాజ్ నటించగా విడుదలయ్యింది.ఇక అప్పటి నుంచి నేటి వరకు కన్నడ మరియు తెలుగు సినిమాల్లో మొత్తంగా 200 కి పైగా సినిమాల్లో నటించాడు.ఇక తెలుగు లో నేటి భారతం, అన్న, సమరసింహా రెడ్డి వంటి 20 సినిమాల్లో తన విలనిజాన్ని చూపించి ప్రేక్షకులను భయపెట్టాడు.
ఇక కెరీర్ తొలినాళ్లలో హీరో గా కూడా కొన్ని సినిమాల్లో నటించగా, కన్నడ భాషలో ఇతడిని డైనమిక్ హీరో అని ముద్దుగా పిలుస్తూ ఉంటారు.హీరో కన్నా కూడా విలన్ గానే ఎక్కువ పేరు సంపాదించుకున్న దేవరాజ్ ఇప్పటికి సపోర్టింగ్ పాత్రల్లో నటిస్తూ బిజీ గానే ఉన్నాడు.
ఇక అయన వ్యక్తి విషయాల్లోకి వెళ్తే దేవరాజ్ ఆయనతో కలిసి నటించిన చంద్ర లేక అనే ఒక హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడు.వీరిద్దరూ కలిసి సిక్కు, కేందాడా మాలే వంటి సినిమాల్లో కలిసి నటించారు.షూటింగ్ లొకేషన్ లోనే ఇద్దరు ప్రేమలో పడి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు.పెళ్లి తర్వాత చంద్ర లేక సినిమాలకు గుడ్ బై చెప్పింది.వీరికి ప్రజ్వల్, ప్రణామ్ అనే ఇద్దరు కుమారులు ఉండగా, ఇద్దరు కూడా నటిస్తూ సెటిల్ అవుతున్నారు.ఇందులో ప్రజ్వల్ మంచి యాక్టర్ గా సెటిల్ అయి తానేంటో నిరూపించుకోగా, ప్రణామ్ ఇంకా నిలదొక్కుకోవాల్సి వుంది.
ఇక దేవరాజ్ చివరగా తెలుగు లో భరత్ అనే నేను సినిమాలో నటించాడు.