చిత్తూరు జిల్లా శాంతిపురం ఎమ్మార్వో కార్యాలయంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం కలకలం సృష్టించింది.ఎమ్మార్వో కార్యాలయం డోర్ కు తాడు కట్టి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
బాధితుడు శాంతిపురం మండలం చెంగుబల్ల గ్రామ వాసి గోపాల్ గా గుర్తించారు.వెంటనే గమనించిన ఆఫీస్ సిబ్బంది ఆత్మహత్య చేసుకోకుండా రైతును నిలువరించారు.
గ్రామ చెరువును కొందరు వ్యక్తులు ఆక్రమించుకోవడంతో తమ పొలానికి దారి లేకుండా పోయిందని రైతు గోపాల్ ఆరోపిస్తున్నారు.తన సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సమస్య పరిష్కారం కాకపోతే తనకు ఆత్మహత్యే శరణ్యమని వాపోయారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని గోపాల్ కోరుతున్నాడు.







