బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ముఖర్జీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర.ఈ సినిమా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ ప్రేక్షకుల ముందుకు పాన్ ఇండియా స్థాయిలో విడుదలై మంచి ఆదరణ సంపాదించుకుంది.
ఇక ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇకపోతే ఈ సినిమాని అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా నిర్మించడమే కాకుండా ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందు రాబోతుందని ఆయన ముఖర్జీ గతంలో వెల్లడించారు ఇప్పటికే మొదటి పార్ట్ విడుదల కాగా త్వరలోనే రెండవ పార్ట్ షూటింగ్ పనులను ప్రారంభించబోతున్నారు.
ఇకపోతే బ్రహ్మాస్త్ర సినిమా పార్ట్ 2 గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.ముఖ్యంగా ఈ సినిమాలో దేవ్ పాత్రలో పలువురు హీరోలు నటించబోతున్నారని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
బ్రహ్మాస్త్ర సినిమాలో దేవ్ పాత్రలో రణవీర్,యశ్,హృతిక్ రోషన్ వంటి హీరోలు నటిస్తున్నారని ఇప్పటికే ఎంతో మంది పేర్లు బయటకు వచ్చాయి.అయితే ఈ సినిమా నిర్మాత కరణ్ మాత్రం విజయ్ దేవరకొండ పేరును సూచించినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదివరకే కరణ్ జోహార్ నిర్మాణంలో లైగర్ సినిమాలో నటించిన విజయ్ దేవరకొండను బ్రహ్మాస్త్ర సినిమాలో తీసుకోవడానికి నిర్మాత ఆసక్తి చూపినట్టు సమాచారం.

ఈ క్రమంలోనే ఈ విషయంపై డైరెక్టర్ అయాన్ ముఖర్జీ స్పందిస్తూ.బ్రహ్మాస్త్ర సినిమాలో దేవ్ పాత్ర కోసం వస్తున్న బజ్ చూస్తుంటే చాలా సంతోషం వేస్తుంది.జనాలు ఈ పాత్రను బాగా ఓన్ చేసుకున్నారు మొన్నటి వరకు ఎంతోమంది ఈ పాత్రలో హృతిక్, రణవీర్ నటిస్తున్నారని భావించారు బహుశా ఈ పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారని చెప్పిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదంటూ ఈయన వెల్లడించారు.
అయితే ఇప్పటివరకు దేవ్ పాత్రలో ఎవరు నటిస్తారు అనే విషయం గురించి ఫైనల్ కాలేదని,ఈ పాత్రలో విజయ్ దేవరకొండ నటిస్తున్నారనే విషయంలో కూడా ఏమాత్రం వాస్తవం లేదని ఈయన క్లారిటీ ఇచ్చారు.దీంతో దేవ్ పాత్ర గురించి వస్తున్న వార్తలన్నింటికీ పులి స్టాప్ పడింది.







