రేఖ.ఈ పేరు ఎన్నో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్.ఈమెను ఇండస్ట్రీలో విమర్శించని వారుండరు అంటే అతిశయోక్తి కాదు.ఎన్నో అవమానాలు, అశ్లీలతకు కేరాఫ్ అనే బిరుదులు, బోల్డ్ క్యారెక్టర్స్ చేస్తుందని నిందారోపణలు, అంతేకాకుండా జీవితంలో అనుకోకుండా వచ్చిన ఒడిదుడుకులు ఇవన్నీ ఆమెను సక్సెస్‌ను అడ్డుకోలేకపోయాయి.
అరచేతిని అడ్డం పెట్టి సూర్యకిరణాలను ఆపలేరు అన్నట్టుగా విమర్శులు, నిందలు ఏవీ అడ్డుకోలేకపోగా.వాటి మీద నుంచే బాలీవుడ్ క్వీన్ స్థాయికి చేరుకుంది.దశబ్దాల పాటు హిందీ చిత్ర పరిశ్రమను శాసించే స్థాయికి ఎదిగింది రేఖ.ఎన్నో అవార్డులు, ఫిలిం ఫేర్స్, జాతీయ అవార్డుతో పాటు 2010 భారత ప్రభుత్వం పద్మ శ్రీతో సత్కరించింది.‘రేఖ’ విజయాన్ని చూసి ఇప్పటికీ కొందరు కుళ్లుకోకుండా ఉండలేరంటే ఆమె ఎంటో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదనుకుంట.
రేఖ ప్రముఖ తమిళ యాక్టర్ జెమిని గణేషన్ కూతురు.
మహానటి సావిత్రి ఈమకు పిన్ని అవుతారు.అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చినా రేఖకు అంత ఈజీగా సక్సెస్ రాలేదు.
తండ్రి ప్రేమకు దూరమైన రేఖ చైల్డ్ ఆర్టిస్టుగా వెండితెరకు పరిచయం మైంది.ఆ తర్వాత బాలీవుడ్‌లో ఎన్నో చిత్రాల్లో నటించింది.
ఆమెకు కొంచెం దూకుడు ఎక్కువ.అదే ఆమె కెరీర్‌కు చాలా ఇబ్బందులను తెచ్చిపెట్టింది.
తనతో నటించిన ఓ యాక్టర్ ను రేఖ అతని అనుమతి లేకుండా గట్టిగా ముద్దుపెట్టుకోవడం వలన తన భర్త దూరమయ్యాడు.ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి.
ఆ తర్వాత తన సినీ కెరీర్‌లో ఎన్నో డౌన్స్ వచ్చినా వాటన్నింటినీ తట్టుకుని మరి నిలబడింది.
ఆ తర్వాత స్టార్ యాక్టర్ అమితాబ్ బచ్చన్, రేఖ మధ్యలో సీక్రెట్ రిలేషన్ ఉందని జోరుగా వార్తలొచ్చాయి.అది కూడా ఆమె కెరీర్‌లో ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది.ఇప్పటికీ రేఖ, బిగ్ బీ కలిస్తే ఆనాటి గాసిప్స్‌ను గుర్తుచేసుకుంటారట ఇండస్ట్రీలోని ప్రముఖులు.
రేఖ లుక్స్ కూడా ఆమెకు బ్యాడ్ నేమ్ తీసుకొచ్చింది.ఇతరులను తినేలా చూస్తుందని కొందరు కామెంట్ చేసేవారట.
బోల్డ్ సినిమాలు, రొమాంటిక్ సినిమాల్లో యాక్ట్ చేసినందుకు గాను ‘నేషనల్ వ్యాంప్’ అని కొందరు బిరుదు కూడా ఇచ్చారని తెలిసింది.ఇన్ని అవమానాలు, విమర్శలు కూడా దీటుగా ఎదుర్కొని రేఖ బాలీవుడ్ క్వీన్ అయ్యింది.ఫలితంగానే ఆమె నటనకు జాతీయ ఉత్తమ నటి అవార్డు.2010లో పద్మ శ్రీ అవార్డు దక్కింది.