సినీ ఇండస్ట్రీలోకి ఇటీవల ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు మురళీధర్ గౌడ్(Muraludhar Goud) ఒకరు.బలగం సినిమాతో ఎంతో ఫేమస్ అయిన ఈయన ఏడాదికి మూడు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.
ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్న మురళీధర్ గౌడ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vadtunnam)సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
అసలు ఈ సినిమాలో ఎందుకు నటించానా అని తాను బాధపడుతున్నానంటూ ఈయన తెలిపారు.

ఇలా ఈ ఇంటర్వ్యూ సందర్భంగా యాంకర్ మురళీధర్ గౌడ్ ను ప్రశ్నిస్తూ ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.సినిమా చాలా మంచి సక్సెస్ అయ్యింది.ఈ సినిమాలో నటించినందుకు మీరు ఎలా ఫీలవుతున్నారు అంటూ ప్రశ్న వేశారు.
ఈ ప్రశ్నకు మురళీధర్ గౌడ్ సమాధానం చెబుతూ… ఈ సినిమాలో తాను ఎందుకు నటించానా అని బాధపడుతున్నానని షాకింగ్ సమాధానం ఇచ్చారు.అసలు ఇంత మంచి సినిమాలో నటించినందుకు ఎందుకు బాధపడుతున్నారనే ప్రశ్న ఎదురయింది.

ఈ సినిమాలో హీరోయిన్లుగా మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh)ఇద్దరూ నటించారు.అయితే ఐశ్వర్య రాజేష్ నన్ను నాన్న అంటూ మీనాక్షి చౌదరేమో బాబాయ్ అంటూ పిలుస్తూ వచ్చారు.ఇలా వీరిద్దరూ నాన్న బాబాయ్ అంటూ పిలవడం నాకు నచ్చలేదు అందుకే ఈ సినిమా ఎందుకు చేశానా అంటూ ఫీల్ అయ్యానని ఈయన సరదాగా సమాధానం చెప్పారు.ప్రస్తుతం మురళీధర్ గౌడ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటించిన ఈ సినిమా 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే.